నేటి సమాజంలో చాల మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు. ఇల్లు కట్టుకోవడం నుండి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అనేది కూడా చూస్తుంటారు. అయితే కొంత మంది ఇంట్లో పక్షులను పెంచుకుంటూ ఉంటారు. ఇక తెల్లవారుజమునా పిట్టలకిలకిలారావాలు. కోకిలమ్మల కుహుకుహూ గానాలు. ఊర పిచ్చుకల కిచకిచలు ఆ ఇంట్లో సరికొత్త సంగీతాన్ని సృష్టిస్తాయి. అతిథి గృహాల్లాంటి గూళ్లలో ఒదిగిపోతాయి.ఆ ఇంటి ఆతిథ్యాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాయి. వివిధ రకాల పక్షులు కాలానుగుణంగా ఆ ఇంటికి వచ్చి వెళ్తాయి.

చాలా మంది ఇళ్లల్లో పక్షులు తాలూకా పిక్చర్స్ ఉంటాయి. అలానే కొందరి ఇళ్లల్లో పక్షలుని కూడా పెంచుకుంటూ వుంటారు. అయితే వాటి వలన మంచి కలుగుతుందా..? లేదా అవి ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి..? ఇలా అనేక విషయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే మరి పక్షుల వలన కలిగే లాభాలు ఏమిటి అనేది కూడా చూసేద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం పక్షులని ఇంట్లో పెంచితే చాల మంచి కలుగుతుంది అని అంటున్నారు. పక్షులుని ఇళ్లల్లో పెంచుకోవడం వలన కూడా ఎంతో మంచిదని చెబుతున్నారు.

ఇక ఎక్కడైతే పక్షులు ఉంటాయో అక్కడ వాతావరణం అంతా బాగా ఉంటుందట. మీరు కావాలంటే నిజమైన పక్షులు పెంచచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే పక్షుల బొమ్మలు లేదా ఫోటోలు వంటివి కూడా పెట్టుకోవచ్చు. వాల్ పోస్టర్స్ లాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు. వీటి వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివిటీ ఉంటుందని ఆయన చెప్పారు. అలానే మీ పనిలో సక్సెస్ బాగా పెరుగుతుందని కూడా చెప్పారు.

అప్పట్లో ఆకాశంలోకి చూస్తే  రకరకాల పక్షుల గుంపులు కనిపించేవి. కొన్ని ఒంటరిగా వెళ్లేవి. ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎక్కడికి వెళ్తున్నాయో  తెలియదు. చెట్ల కొమ్మలపై వాలి సందడి చేసేవి. ఇప్పుడు ఆ పక్షుల గుంపులు అరుదైన దృశ్యాలే. ఇంట్లో పక్షులను పెచ్చుకోవడం వలన పక్షులను కాపాడిన వాళ్ళం అవుతాము.

మరింత సమాచారం తెలుసుకోండి: