తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో కాస్త విమర్శల విషయంలో దూకుడుగా ఉన్నారు. ఘాటుగా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. నాగార్జున సాగర్ ఎన్నికలు నేపధ్యంలో ఏది మాట్లాడినా సరే తెరాస ను అన్ని విధాలుగా టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... టిఆర్ఎస్ అధికార మదంతో దుష్ట పాలన చేస్తోంది అని అన్నారు. పోడు భూముల గోడు వినిపించడానికి కేసీఆర్ సభకు వెళ్లిన గిరిజన మహిళలను కుక్కలని సంభోదించారు అని చెప్పుకొచ్చారు.

గిరిజన మహిళలను అవమానించిన టిఆర్ఎస్ కు ఒక్క గిరిజన ఓటు పడొద్దు అని ఆయన అన్నారు. మంత్రి మల్లారెడ్డి లంచాలు వసూల్ చేసే పనిలో పడ్డారు అని ఆయన పేర్కొన్నారు. లంచం డిమాండ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు అని ఆయన విమర్శలు చేసారు. అయినా ఎందుకు అతన్ని బర్త్ రఫ్ చేయలేదు అని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు అందులో ఏమైనా వాటాలు వస్తున్నాయా అని ప్రశ్నించారు. దీన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళతాం అని అన్నారు. నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెంగుళూర్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం సిగ్గుచేటు అని ఆయన ఆరోపణలు చేసారు.

డ్రగ్స్ కేసులో ఉన్న  ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయాలి అని డిమాండ్ చేసారు. బీజేపీ, టిఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది అని, కర్ణాటక బీజేపీ నేతలతో మాట్లాడుకుని డ్రగ్స్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ సాగర్ లో టిఆర్ఎస్ ను గెలిపించే ప్రయత్నం సిగేస్తోంది అని,  జగన్ తో కుమ్మకు అయ్యాడు కాబట్టే కేసీఆర్ సంగమేశ్వర పై నోరు మెదపడం లేదు అని మండిపడ్డారు. సాగర్ లో డబ్బులు, మద్యం ను సాగర్ లో ఫెయిర్ ఎలక్షన్ జరిపించాలని ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్ ను కలుస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు. కోవిడ్ నిబంధనల ఉండగా కేసీఆర్ సభకు ఎలా అనుమతి ఇస్తుందో చూస్తాం అని అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: