ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు చాలా వరకు జాగ్రత్తగా తీసుకుని సీఎం కేసీఆర్ రాజకీయం చేయాల్సి ఉంటుంది. నాగార్జునసాగర్ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్ గా లేకపోతే ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ కి సంబంధించి కొంత మంది కీలక నేతలు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ లోకి వెళ్ళడానికి టిఆర్ఎస్ పార్టీ నేతలు రెడీ అవుతున్నారు అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. కాబట్టి దీనిని సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకుని నాగార్జునసాగర్ పరిధిలో అసహనంగా ఉన్న కొంత మంది నేతలతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

 రాజకీయంగా ఈ పరిస్థితి టిఆర్ఎస్ పార్టీకి ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది కాదు. గతంలో ఎవరైనా సరే పార్టీ మారిన సరే టిఆర్ఎస్ పార్టీ పెద్దగా ఇబ్బంది పడేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీ ఎక్కువగా రాష్ట్రంలో ఫోకస్ చేసింది. ఎవరైనా సరే టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్తే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. అందుకే సీఎం కేసీఆర్ కాస్త నాగార్జునసాగర్ లో అసంతృప్తిగా ఉన్న నేతలతో మాట్లాడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. బహిరంగ సభ నిర్వహించిన సరే టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 కాబట్టి సీఎం కేసీఆర్ చాలా వరకు కూడా జాగ్రత్తగా అక్కడున్న పార్టీ నేతలతో చర్చలు జరిపి అందరినీ కూడా ముందుకు వెళ్లాల్సిందిగా సూచనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని అనుమానాలు టిఆర్ఎస్ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. జానారెడ్డి దాదాపుగా గెలిచే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: