తెలంగాణ లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని అంశాలు కాస్త కీలకంగా మారుతున్నాయి. ప్రధానంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి కచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఇప్పటివరకు కూడా సమర్థవంతంగా ముందుకు నడిపించే నాయకత్వం తెలంగాణలో కనపడలేదు. అయితే ఇప్పుడు నాగార్జునసాగర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ మంత్రి జానారెడ్డి విషయంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లవచ్చు.

కాబట్టి ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఇబ్బంది పడవచ్చు అని అంచనా వేస్తున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపితే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా ఆయనతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ కు సహకరించిన వాళ్లు కూడా ఇకముందు సహకరించే అవకాశం లేకపోవచ్చు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీచే అవకాశాలు కూడా ఉన్నాయి.

భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా గట్టిగానే దృష్టి పెట్టే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకవేళ జానారెడ్డి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడానికి ఆర్థికంగా కూడా సిద్ధం అయితే మాత్రం సీఎం కేసీఆర్ ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అనే భావన చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా జానారెడ్డి తనవైపుకు తిప్పుకునే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: