నాగార్జునసాగర్ లో ఎవరు గెలుస్తారు ఏంటనే దానిపై కూడా చాలావరకు అంచనాలు నెలకొన్నాయి. నాగార్జునసాగర్ విషయానికి వస్తే టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉండవచ్చు అనే భావన కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. జానా రెడ్డి బలమైన నేత కావడంతో ఆయన భారీగానే నాగార్జునసాగర్ లో ఖర్చు చేశారు అంటూ కొంతమంది వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.

 అయితే నాగార్జునసాగర్ లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు అనే భావన కూడా ఉంది. అయితే ఎవరు గెలిచినా సరే తక్కువ మెజారిటీతో బయటపడే అవకాశాలు ఉండవచ్చు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. 5 వేల లోపు ఓట్లతోనే ఎవరైనా సరే బయటపడే అవకాశాలు ఉండవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ కి సంబంధించి భారతీయ జనతాపార్టీ కూడా సీరియస్ గానే ఉన్నా సరే ఆ పార్టీకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలు బాగా ఇబ్బంది పడడం నిత్యావసర సరుకులు భారీగా పెరిగిపోవడం అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరగడం వంటివి నాగార్జునసాగర్ పరిధిలో ప్రభావం చూపించే అవకాశాలు ఉండవచ్చు అని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

 నాగార్జునసాగర్ లో జానారెడ్డి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పడే అవకాశాలు ఉండవచ్చు. టిఆర్ఎస్ పార్టీ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా అదనపు బలం వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. నాగార్జునసాగర్లో గెలవడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని తాను ఎంత వరకు ముందుకు నడిపించగలను అనేదానిపై జానారెడ్డి నుంచి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: