మొన్నటి వరకు దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అతి తక్కువగా ఉంది. అంతేకాదు ఇక ప్రపంచ దేశాలకు సైతం కరోనా వైరస్ ను కంట్రోల్ చేసిన దేశంగా భారత్ ఆదర్శంగా నిలిచింది.  ఈ క్రమంలోనే అటు ప్రజలందరిలో కూడా ధైర్యం వచ్చేసింది. అంతేకాదు కరోనా వైరస్ పై అవగాహన కూడా వచ్చింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి.  ఇలాంటి సమయంలో ఎవరూ ఊహించని విధంగా కరోనా వైరస్ మళ్ళీ కోరలు చాస్తూ ఉండడం అందరిని బెంబేలెత్తిస్తోంది.



 రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది అయితే ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుండగా అదే సమయంలో అటు కరోనా వైరస్ కూడా వేగంగా వ్యాపిస్తూ  ఉండడం  ఆందోళన పెంచుతుంది. మరికొంతమంది వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా కరోనా సోకుతూ ఉండటం మరింత భయాందోళనకు గురిచేస్తుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్న ఒకే ఒక సవాలు  వైరస్ రోగులను శరవేగంగా గుర్తించడమే అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇక కరోనా వైరస్ పరీక్షలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల శరవేగంగా నిర్వహించాలి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేస్తోంది.



 ఇకపోతే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇక రోగులను గుర్తించేందుకు వివిధ రకాల అధ్యయనాలు జరిగాయి. ఎన్నో కొత్త విషయాలను కూడా వెలుగులోకి తీసుకువచ్చారు. కాగా రెండు నిమిషాల్లోనే కరోనా వైరస్ రిజల్ట్ పక్కాగా తెలుసుకునే విధంగా ఓ పరికరాన్ని తయారు చేశారు చెన్నై పరిశోధకులు. చెన్నై  కేజె ఆసుపత్రి  పరిశోధకులు కోవిడ్ ట్రాకర్ అనే పేరుతో పిలిచే డివైస్ ని కనుగొన్నారు. చేతి ఆకారంలో ఉండే ఈ డివైస్ సహాయంతో.. బిపి శరీర ఉష్ణోగ్రత హీమోగ్లోబిన్ రక్త కణాల సంఖ్య తోపాటు జీటా పొటెన్షియల్ స్థాయిలను కూడా తెలుసుకోవచ్చట. అయితే ఆర్ టి పి సి ఆర్ కంటే ఎంతో పక్కాగా ఇది రిజల్ట్ ఇస్తుంది అని చెబుతున్నారు పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: