ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు ఈ క్రమంలోనే మళ్లీ కరోనా వైరస్ నియంత్రణపై కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇదే రీతిలో పెరుగుతూ ఉంటే అటు వైరస్ ను కంట్రోల్ చేయడం అసాధ్యంగా మారిపోతుందని అంతేకాకుండా పరిస్థితి చేయి దాటి పోయే అవకాశం ఉంది అని భావిస్తున్న ప్రభుత్వం...  ఇప్పటికే పలు రకాల కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి అని భౌతిక దూరం పాటించాలని లేదంటే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది.




 అయితే గతంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోయిన నేపథ్యంలో ఇక ఆర్టీసీ బస్సుల ప్రయాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం 50 శాతం సీట్ల సామర్థ్యం తోనే ఆర్టీసీ బస్సులను నడపాలని అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత  వైరస్ ప్రభావం కాస్త తగ్గడంతో ఇక పూర్తిస్థాయి సీటింగ్ సామర్థ్యంతో బస్సులను నడిపేందుకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఇక ఇప్పుడు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో ఆర్టీసీ బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అటు ఏపీఎస్ఆర్టీసీ కి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


 ఇక ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది ఇక నుంచి ఏపీ బస్సుల్లో 50శాతం సీట్లు మాత్రమే ప్రయాణికులకు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు.ప్రతి రెండు సీట్లలో ఒకటి ఖాళీగా ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు స్లీపర్ బస్సు లో కూడా సగం సీట్లను కేటాయించాలి అంటూ అధికారులు సూచించారు.  ఈ మేరకు సాఫ్ట్వేర్ లో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తుంది.అయితే ఏపీ నుంచి కర్ణాటక వెళ్లే అన్ని రకాల బస్సులు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నే నడవాలి అంటూ ఇటీవల ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: