ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులపై నమోదు చేసిన కేసుల విషయంలో ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. ఈ పట్టుదల వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం జరుగుతుందే గాని నష్టం ఎక్కడా జరగడం లేదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తున్న వ్యవహారశైలిపై తెలుగుదేశం పార్టీ కాస్త సీరియస్ గానే ముందుకు వెళుతుంది.

ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు కూడా గట్టిగానే చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల పై కీలక నేతల పై గట్టిగా మాట్లాడే నాయకులపై కేసులు నమోదు చేయడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర పై కేసు నమోదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేసిన విషయంలో అసలు ఏసీబీ అధికారులు గాని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎటువంటి స్పష్టత కూడా ఇవ్వలేదు.

అసలు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు ఏంటి అనేది ఎవరూ కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. అలాగే గతంలో ముగ్గురు నలుగురు నేతలను అరెస్టు చేసిన సందర్భంగా కూడా అసలు ఎందుకు అరెస్టు చేశారో ఏంటి అనేది చెప్పడం లేదు. దీంతో వాళ్ళను కక్షసాధింపుగా అరెస్టు చేశారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజల్లోకి వెళ్లడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. తమను వేధిస్తున్నారని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారని ప్రజలకు దూరం చేస్తున్నారని నమ్ముకున్న వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పడానికి వాళ్లకు మంచి అవకాశాలు దొరికినట్లు ఉంటుందని అంటున్నారు. జగన్ వాళ్లకు రాజకీయ భవిష్యత్తు నిర్మిస్తున్నారని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: