ఆయన రాజకీయ కురు వృద్ధుడు. ఎన్నో యుద్ధాల్లొ ఆరితేరిన వాడు. కానీ రాజకీయ విరమణ మాత్రం అనూహ్యంగా జరిగిపోయింది. ఆయన సీనియారిటీకి తెలంగాణాకు సీఎం కావాలి. కానీ అనుకున్నవి జరిగితే రాజకీయం ఎలా అవుతుంది. ఆఖరుకు తాజాగా నాగార్జున సాగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి యువకుడు కొత్తవాడు అయిన నోముల భగత్ మీద భారీ తేడాతో ఓడిపోయారు.

ఆయనే కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ నేత జానారెడ్డి. ఓడిపోగానే జానారెడ్డిలో ఒక్కసారిగా రాజకీయ వైరాగ్యం ఆవహించింది. తాను ఇక ఏ ఎన్నికలోనూ పోటీ చేయను అని చెప్పేశారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం వెనక కాంగ్రెస్ అధినాయత్వానికి ఇచ్చిన మాట ఉందని చెప్పుకున్నారు. తాను పోటీ చేశాను. జనాలు ఓటమితో తమదైన  తీర్పు ఇచ్చారు. దాన్ని తాను శిరసా వహిస్తాను అని చెప్పేశారు.

తన వయసు డెబ్బయి అయిదేళ్ళు కాబట్టి తాను రాజకీయంగా  ఇక చురుకుగా ఉండలేను అని కూడా జానారెడ్డి అంటున్నారు. తన వారసులు కాంగ్రెస్ కార్యకర్తలే అని కూడా చెబుతున్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి అవసరం అయింతే సూచనలు సలహాలు ఇస్తాను అని కూడా ఆయన అంటున్నారు. అలగే టీయారెస్ ప్రభుత్వానికి కూడా సలహాలు అడిగితే ఇస్తాను. ఇక రాజకీయాలు సెలవు అంటూ పెద్ద దండమే పెట్టేశారు.

మొత్తానికి చూస్తే జానారెడ్డి వైరాగ్యం చూస్తే కాంగ్రెస్ తెలంగాణాలో ఇప్పట్లో కోలుకోదు అన్న సందేశం ఇచ్చారా లేక కాంగ్రెస్ పార్టీలో ఈదలేక అలసి పక్కకు వచ్చేశారా అన్న చర్చ అయితే ఉంది. ఏది ఏమైనా ఏడేళ్ళు గడచినా కూడా కాంగ్రెస్ లో గ్రూపులు అలాగే ఉన్నాయి. ఎన్ని ఓటములు ఎదురు అవుతున్నా కూడా నేతలు మాత్రం మారడం లేదు. జానారెడ్ది వంటి పెద్ద మనిషి ఓటమి వెనక కూడా ఇదే మాట వినిపిస్తోంది. దీంతో వీటికి విసిగి జానారెడ్డి  స్వస్తి అనేశారు అంటున్నారు. మరి కాంగ్రెస్ భవిషత్తు జానారెడ్డి వైరాగ్యం బట్టి చూస్తేనే అర్ధం అవుతుంది అన్న వాళ్ళూ ఉన్నారు. మరి హస్తం పార్టీ ముందు ముందు ఎలా సాగుతుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: