ముంబై: దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశ ప్రజలు కంటినిండా నిద్ర కూడా పోలేకపోతున్నారు. ఎప్పుడు ఎలా సోకుతుందో అని భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ మొదటి వేవ్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గతేడాది కరోనా వ్యాప్తితో పోల్చుకుంటే సెకండ్ వేవ్ నరకాన్ని తలపిస్తుంది. కరోనా కారణంగా ప్రతిరోజూ మరణిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాకుండా దేశంలో నెలకొన్న ఆక్సిజన్, ఔషధాల కొరత ప్రజలను మరింత కలవరపెడుతుంది. అయితే కరోనాను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి.


వీటిలో దేశ రాజధాని ఢిల్లీ సహా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ క్రమంలో మరిన్ని రాష్ట్రాలు ఉన్నాయి. లాక్‌డౌన్ విధించడంతో దేశంలో గత వారాలతో పోలిస్తే దాదాపు 13శాతం కరోనా కేసుల వ్యాప్తి తగ్గింది. అంతేకాకుండా దేశంలో కరోనాను కట్టడి చేయడం కూడా లాక్‌డౌన్ ద్వారా సులభతరం అవుతుంది. ఈ తరుణంలో లాక్‌డౌన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందులో ఉద్దవ్ ఠాకరే ప్రభుత్వం సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ఏప్రిల్ 15 నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేసిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తుంది.



రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. దాంతో రాష్ట్రంలో జూన్ 1 నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించాలని, అదే విధంగా కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో పరిస్థితులను సరిచూసి కుదిరితే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని చూస్తున్నారంట. ఈ మేరకు వివరాలను మహారాష్ట్ర ప్రజారోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. జూన్1 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని, ఆ తరువాత లాక్‌డౌన్ సడలించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రతి జిల్లాలో పడకలు, ఔషధాలు, ఆక్సిజన్ అన్ని అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: