చాలా మందికి కరెంటు బిల్లు ఎంత వస్తుంది.. ఎలా వస్తుందో అవగాహన ఉండదు. మనం కాల్చుకోబట్టే బిల్లు వస్తుందేమో అనుకుంటారు. కానీ.. కరెంటు బిల్లుల విషయంలో ఉద్దేశపూర్వకంగా దోపిడీ జరుగుతుందంటున్నారు కొందరు.  ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని మెస్సేజులు సర్క్యులేట్ అవుతున్నాయి. వాటి ప్రకారం.. అధికారుల ఆదేశాల ప్రకారమే దోపిడీ జరుగుతోందంటున్నారు.

విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి. కానీ 30 రోజుల తరువాత 31 నుండి 40 రోజులవరకు బిల్లులు  కొట్టి  ఇస్తున్నారట.100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. ఒక్కొక్క యూనిట్ కాస్ట్. 2 రోజులు ఆలస్యం  చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వస్తోందట. అప్పుడు 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలు. దీనివల్ల ఇప్పుడు అనవసరంగా 6.90 రూపాయల లెక్క ప్రకారం కట్టాలి. అప్పుడు 101  ఇంటూ 6.90 = 690 కట్టవలసి వస్తుంది. 100 యూనిట్స్ కు 390/-, తేడా 690-390=300 అదనం.

ఇలా జరుగుదంటున్నారు కొందరు. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయాలని. ఈ మోసం ప్రతి నెల జరుగుతుందని.. జనం నోరు మూసుకొని బిల్లులు కడుతున్నాని అంటున్నారు. ఈ మోసాన్ని ఆపడానికి సపోర్ట్ చేయాలని.. ఈ విషయాన్ని అందరికి తెలియజేయాలని.. సోషల్ మీడియాలో మెస్సేజులు పెడుతున్నారు. మరి ఈ మెస్సేజుల్లో ఎంత వాస్తవం ఉందనేది అధికారులు చెక్ చేసుకుంటే మంచిది.

సహజంగా.. అధికారులు ఇలా చేయమని చెప్పరు. అలా చేయడం వల్లవారికి వ్యక్తిగతంగా కలిగే లాభం కూడా ఉండదు. కానీ.. టార్గెట్‌ల కోసం కొందరు అధికారులు అలా చేయమని చెప్పే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. అందుకే విద్యుత్ శాఖ అధికారులు ఇలాంటి మెస్సేజులపై స్పందించాలి. ప్రజలకు తగిన వివరణ ఇవ్వాలి. దోపిడీ నిజమైతే అధికారులపై చర్యలు తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: