ప్రజల మౌలిక సదుపాయాల్లో విద్యుత్ కూడా ఒకటి. ప్రస్తుతం దేశం విద్యుత్ పరంగా భారీ లక్ష్యాలను చేరుకుంది. గతంలో పట్టణ ప్రాంత ప్రజలు రోజుకు ఎన్నిగంటల కరెంటు కోత ఉంటుందని చూసుకునేవారు. ఇక గ్రామీణ ప్రాంతాల విషయం చూస్తే రోజులో ఎన్ని గంటలు కరెంటు ఉందన్నది అప్పటి లెక్కలు. అక్కడి నుంచి నేడు 24 గంటలు కరెంట్ అందించే స్థాయికి రావడం అంటే పెద్ద సక్సెస్‌గానే చెప్పుకోవాలి. ఇప్పటికీ సాంకేతిక అంతరాయాల కారణంగా విద్యుత్ కోతలు ఏర్పడటం తప్ప కరెంటు కోతలయితే దాదాపు కనుమరుగయ్యాయి. ఇక ముందు కూడా ఇదే తరహాలో ఉండాలని ప్రభుత్వం దేశంలో సోలార్ పవర్ ప్లాంట్లను గణనీయంగా పెంచుతుంది. ఇందులో భాగంగానే తీసుకున్న చర్యల ద్వారా సోలార్ పవర్ కెపాసిటీ గణనీయంగా పెరిగింది.
ఇదే విధంగా తాజాగా గ్రీన్ ఎనర్జీ కూడా గణనీయంగా పెరిగింది. ఇటీవల వచ్చిన లెక్కల ప్రకారం దేశంలో గ్రీన్ ఎనర్జీ దాదాపు 72 శాతం పెరిగింది. 2014లో 80 గిగావాట్లుగా ఉన్న ఈ గ్రీన్ ఎనర్జీ 2020 నాటికి 138 గిగావాట్లకు పెరిగింది. ఇదే క్రమంలో సోలార్ పవర్ కూడా భారీగా పెరిగింది. 2015 నాటికి 2.6 గిగావాట్స్‌గా ఉన్న సోలార్ పవర్ 2020 నాటికి 34 గిగావాట్లకు పెరిగింది. అంటే దాదాపు 1207 శాతం సోలార్ పవర్ పెరిగింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం ఈ రెండింటిని మరింత పెంచాలని ప్రణాళిక సిద్దం చేస్తోంది. వీటి వల్ల గ్రామీణ, పట్టాభివృద్ది వేగవంతం అవ్వడమే కాకుండా ప్రజలకు ఎంతో లబ్ది చేకూరుతుంది.
ఇదే తరహాలో దేశంలో పెట్రోల్‌‌ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇథనాల్‌ ఉత్పత్తిని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంది. ఇథనాల్ ద్వారా బయోఫ్యూయల్‌ను తయారు చేయాలని చూస్తోంది. దీని కారణంగా దేశంలో కాలుష్యానికి చెక్ చెప్పడంతో పాటు పర్యావరణాన్ని కూడా ఎంతగానో కాపాడుకోవచ్చు. ఈ కారణంగానే 2030 నాటికి దేశమంతటా బయోఫ్యూయల్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే తాజాగా దీనిని కుదిరితే 2025నాటికే అందుబాటులోకి తెచ్చేందుకు సిద్దమవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: