కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పై ఈట‌ల రాజేంద‌ర్ వైఖ‌రిపై  సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. జీవ‌న్ రెడ్డి మాట్లాడుతూ...ప్రభుత్వం తొలగించిన  ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ లో 90 శాతం మంది దళితులేన‌ని అన్నారు. వారిని తొలగించడం మానవత్వం లేని అమానవీయ చర్య అంటూ జానా రెడ్డి వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ కూలీల డబ్బులు రెండు నెలల నుండి చెల్లించడం లేదని అన్నారు. ఉపాధి హామీ పథక ఫీల్డ్ అసిటెంట్స్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జీవ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈట‌ల రాజేంద‌ర్ క‌మ‌లం పార్టీలో చేర‌డం పై జానారెడ్డి స్పందించారు .

కాంగ్రెస్ లో చేరడం చేరకపోవడం ఈటల ఇష్టమ‌ని అన్నారు.
టిఆర్ ఎస్ అవినీతికి బీజేపీ రక్షణగా నిలుస్తుందంటూ జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మ‌రియు కేసీఆర్ ల అవినీతి చిట్టాను భ‌య‌ట‌పెడ‌తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌పై జీవ‌న్ రెడ్డి స్పందించారు. అవినీతి చేసిన టిఆర్ఎస్ నేతలను ఎప్పుడు జైల్లో పెడతారో బండి సంజయ్ చెప్పాలంటూ ప్రశ్నించారు. ఈటల రాజేంద‌ర్ బీజేపీ లో చేరడం వల్ల బలహీన పడ్డారంటూ వ్యాఖ్యానించారు. 

స్వతంత్ర  అభ్యర్థిగా ఈటల పోటీ చేస్తే వేరే విధంగా ఉండేదని అన్నారు. కాంగ్రెస్ వెనుకాల రాహుల్ గాంధీ ఉన్నార‌ని అన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ కంట్రోల్ చేస్తుందంటూ ఈట‌ల చేసిన వ్యాఖ్య‌ల‌ను జానారెడ్డి ఖండించారు. ఈటల రాజేందర్ ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ లో చేరితాను అని తన  వ్యక్తిత్వాని తగ్గించుకున్నారని ఆరోపించారు. ఇండిపెండెంట్ గా నిలబడితే ఈట‌ల రాజేంద‌ర్  50 వేల ఓట్లతో గెలిచేవారంటూ కామెంట్ చేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: