తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రోజుల నుంచి టీపీసీసీ చీఫ్ పదవికి సంబంధించిన  వ్యవహారంలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి  పిసిసి పదవిలో కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీ కాలం పూర్తయిన తర్వాత ఎవరు నూతన పిసిసి అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.  అయితే మొదటి నుంచి అటు కాంగ్రెస్ అధిష్టానం పార్టీలోకి కొత్తగా వచ్చిన మాస్ లీడర్ రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ పదవి ఇచ్చేందుకు సిద్దమయింది అన్న టాక్ వినిపించింది. రేవంత్ కు పిసిసి ఖరారు అయిపోయినట్లే అని ప్రచారం కూడా జరిగింది.



 కానీ కాంగ్రెస్ లో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న సీనియర్ లీడర్ లు మాత్రం కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడానికి అసలు ఒప్పుకోలేదు. దీంతో ఈ వ్యవహారం కాస్త వాయిదా పడుతూ వచ్చింది  అయితే గత కొన్ని రోజుల నుంచి ఎలక్షన్ల నేపథ్యంలో పిసిసి పదవికి సంబంధించి రచ్చ ఎక్కడ జరగలేదు  ఇక ఇప్పుడు మరో సారి కాంగ్రెస్ లో పిసిసి రాజకీయం వేడెక్కింది.  ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కలిసి చర్చించేందుకు ఢిల్లీ పయనమయ్యారు ఇన్చార్జి మాణిక్కం టాగూర్  .



 కాగా పీసీసీ పదవి కోసం ప్రస్తుతం ఎంతో మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో పీసీసీ పదవి ఎలాగైనా దక్కించుకోవాలి అని చూస్తున్న రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ లాంటివారు ప్రస్తుతం ఢిల్లీలోనే మూడు రోజులుగా మకాం వేశారు. అయితే కొత్తగా వచ్చిన వారికి కాకుండా మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న వారికే పిసిసి పదవి అప్పగించాలని ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పదవిని అటు కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి కట్టబెట్ట పోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది  ఇక ఏ క్షణంలోనైనా సోనియాగాంధీ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: