తెలంగాణ‌లో ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కొన‌సాగుతుంది. ఉద‌యం ఆరు గంట‌ల నుంచి సాయంత్రం ఆరుగంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే వ్యాపారా కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే.అయితే ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో లాక్‌డౌన్ ఎత్తివేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది.ఉద‌యం ఆరుగంట‌ల నుంచి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కు అన్ని కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. రాత్రి ప‌ది గంట‌ల నుంచి ఉద‌యం ఆరుగంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేయాలని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది.దీనిపై రేపు క్యాబినేట్ భేటిలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. జూన్ 20 నుంచి కొత్త స‌డ‌లింపులు అమ‌ల్లోకి రానున్నాయి. అన్ని వ్యాపార కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తి ఇచ్చే అవ‌కాశం ఉంది.బ‌స్సులు,రైళ్లు పూర్తిస్థాయిలో న‌డ‌వ‌నున్నాయి.హోట‌ళ్లు,రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమ‌తి ల‌భించ‌నుంది.ధియేట‌ర్ల‌లో 50 శాతం మందికి అనుమ‌తి ఇచ్చి సినిమాలు ప్ర‌ద‌ర్శించేంద‌కు ప్ర‌భుత్వం ఓకే చెప్ప‌నుంది. కానీ స్కూళ్లు,కాలేజీలు,రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌పై ఆంక్ష‌లు కొన‌సాగే అవ‌క‌శాం ఉంది.

ఇప్ప‌టికే రాష్ట్రంలో పాజిట‌వ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డంతో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను క్ర‌మంగా స‌డ‌లింపు ఇస్తూ ప్ర‌భుత్వం ముందుకు వెళ్తుంది.లాక్‌డౌన్ వ‌ల్ల ఆర్థికంగా న‌ష్టం క‌లుగుతున్న నేప‌థ్యంలో ఒక్కొక్క‌టిగా ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నారు.వ్యాపార కార్య‌కలాపాల‌కు ప్ర‌స్తుతం ఉద‌యం ఆరుగంట‌ల నుంచి సాయంత్రం ఆరుగంట‌ల వ‌ర‌కు స‌మ‌యాన్ని కేటాయించారు. రోడ్ల‌పై ర‌ద్దీ కూడా లాక్‌డౌన్‌లో త‌గ్గింది.అన‌వ‌స‌రంగా బ‌య‌టికి వ‌చ్చే వారిపై పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌రిస్తున్నారు.ఇప్ప‌టికే తెలంగాణ వ్యాప్తంగా కోట్లలో ఫైన్లు వేసి..బైక్‌ల‌ను సీజ్ చేశారు.క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న స‌మ‌యంలో లాక్‌డౌన్ తెలంగాణ ప్ర‌భుత్వం క‌ఠినంగా అమ‌లుచేసింది.దాని ఫ‌లితంగానే క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని వైద్య నిపుణ‌లు అంటున్నారు.ఇప్పుడు కేసులు త‌గ్గుమ‌ఖం ప‌ట్ట‌డంతో లాక్‌డౌన్‌ని ఎత్తివేసి నైట్ క‌ర్ఫ్యూ మాత్ర‌మే విధించ‌నున్నారు.ఇటు అంత‌రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసుల‌పై ప్ర‌భుత్వం ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. గ‌తంలో కూడా అంత‌రాష్ట్ర స‌ర్వీసుల‌పై ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిగిన త‌రువాత బ‌స్సుల రాక‌పోక‌లు సాగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: