తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం పీసీసీ చీఫ్ పదవి. గతంలో పిసిసి చీఫ్ పదవిలో కొనసాగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీ కాలం పూర్తి కావడంతో ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ గా ఎవరు  కాబోతున్నారు అనే దానిపై ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది.  ముఖ్యంగా మొదటి నుంచి రేవంత్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపించింది. టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇక తన చరిష్మా తో  కాంగ్రెస్ అధిష్టానాన్ని చెప్పించాడు అనే టాక్ వినిపించింది. మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సమర్థుడని భావించి అధిష్టానం అతనికి పిసిసి చీఫ్ ఇచ్చేసింది అని ప్రచారం కూడా జరిగింది.



 ఇక ఆ తర్వాత కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు కలుగజేసుకోవటం.. అంతలో తెలంగాణలో ఎలక్షన్లు రావడంతో ఇక ఈ పీసీసీ చీప్ ఎంపిక కాస్త వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి పిసిసి చీఫ్ అంశం కాస్త తెర మీదికి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది.  గత కొన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు.  వీరిద్దరిలో ఎవరో ఒకరికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉంది అన్న టాక్ వినిపించింది.  అయితే ఇక ఇప్పుడు అనూహ్యంగా ఈ పదవి మరొకరికి దక్కబోతోంది అనే టాక్ వినిపిస్తోంది.




 కాంగ్రెస్లో సీనియర్ నేతగా కొనసాగుతున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పీసీసీ చీఫ్ కోసం పోటీ ఉంది. ఈ క్రమంలో ఈ ఇద్దరిలో ఎవరికి పీసీసీ చీఫ్ ఇచ్చిన  ఒక వర్గం  నిరాశ చెందే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ కి అది అస్సలు మంచిది కాదు. ఈ క్రమంలోనే ఇక వీరిద్దరికీ కాకుండా దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి  పీసీసీ చీఫ్ పదవి అప్పగించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు ఇటీవలే ఒక ప్రచారం ఊపందుకుంది.  ఇక మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: