సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు రెడ్యా నాయక్ కుమార్తె గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాలోత్ కవిత మహబూబాబాద్ ఎంపీగా ప్రజలకు సేవ చేస్తున్నారు. ప్ర‌జాసేవ‌లో తండ్రికి త‌గ్గ కూతురుగా పేరుతెచ్చుకుంటున్నారు. మాలోత్ క‌విత భారత దేశ చరిత్రలోనే తొలి బంజారా మహిళగా పార్లమెంట్ లో అడుగుపెట్టి చరిత్ర తిరగరాసారు. అంతే కాకుండా లోక్ సభలో తెలంగాణ ప్రజల గొంతుకై సమస్యలను వినిపిస్తున్నారు. లోక్ స‌భ‌లో అడుగుపెట్టిన వెంట‌నే విభజన చట్టంలో ఇచ్చిన హామీల లో భాగంగా ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని లోక్ స‌భ‌లో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బంజారా బిడ్డగా లోక్ సభలో సమస్యలపై కొట్లాడటమే కాకుండా ప్రజా క్షేత్రంలో తిరుగుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. 


ముఖ్యంగా కరోనా కాలంలో మాలోత్ కవిత మహబూబాబాద్ పరిధిలో గడప గడపకు వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. అంతే కాకుండా కరోనా విజృంభిస్తున్న సమయంలో చాలా మంది ప్రజా ప్రతినిధులు భయట కు వచ్చేందుకే భయపడి పోయారు. కానీ ఎంపీ కవిత తన టీమ్ తో కలిసి ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందా లేదా అని ఆస్పత్రులకు వెళ్లి వారిని పరామర్శించారు. వారికి పండ్లు  ఇతర ఆహార పదార్థాలు అందజేశారు. భద్రాచలం నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి పేషెంట్ ను ఎంపీ పలకరించి వచ్చారు. మీకు నేనున్నా కరోనా పై అధైర్య పడొద్దు అని కుటుంబంలో చిన్నవాళ్లకు అక్కలా...ముసలి వాళ్ళకు బిడ్డలా దైర్యం చెప్పి వచ్చారు. 


అంతే కాకుండా డాక్టర్లకు తన నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వచ్చారు. అంతే కాకుండా గ్రామాల్లోనూ పర్యటించి లాక్ డౌన్ వేల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు నిత్యావసరాలను అందజేశారు. ఎర్రని ఎండలో కార్యకర్తలతో కలిసి గ్రామ గ్రామాన తిరిగి ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. మరోవైపు తానే వంట చేసి ఇల్లందు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్ లకు అందజేశారు. దాంతో క‌రోనా వేళ క‌విత‌క్క అందిచిన సేవ‌లు మ‌ర‌వ‌లేమ‌ని ప్ర‌జ‌లు అంటున్నారు.   ఇలా రెడ్యా నాయక్ బిడ్డగా ఓరుగల్లు వీర వనితగా మాలోత్ కవిత చేస్తున్న సేవలెన్నో. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీర్చే విధంగానే తన పాలన ఉంటుందని కవిత నిరూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: