ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన అనే నిర్ణయం కూడా ఒకటి. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కాస్త ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.  నిరుపేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేక చివరికి ఉద్యోగాలు సాధించలేక ఇబ్బందులు పడుతున్నారని ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రారంభించేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం.  తద్వారా పేద విద్యార్థులు సైతం మంచి ఉద్యోగాలు దక్కించుకో గలుగుతారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇక జగన్ తీసుకున్న నిర్ణయం పై అటు ప్రతిపక్ష పార్టీలు మాత్రం దుమ్మెత్తిపోశాయి.



 తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు నిర్వీర్యం చేసేందుకు జగన్ ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయ్ ప్రతిపక్ష పార్టీలు.  ఇలా జగన్ నిర్ణయం కాస్త ఆంధ్ర రాజకీయాల్లో ఎన్నో రోజుల పాటు హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రతిపక్ష పార్టీలు మాత్రమే కాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు సైతం జగన్ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఇప్పటికే పలుమార్లు ఈ విషయం పై విమర్శలు చేయడమే కాదు జగన్ కు లేఖ కూడా రాశారు రఘురామకృష్ణంరాజు.


 ఇక ఇప్పుడు  ముఖ్యమంత్రి జగన్ కి మరోసారి లేఖ రాశారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అని మీరు తీసుకున్న నిర్ణయం తెలుగు వారి గుండెల్లో ముల్లులా గుచ్చు కుంటుంది అంటు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ మీడియం పెడతాము అని చెబుతున్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన యంత్రాంగం ఉందో లేదో ఒకసారి ఆలోచించారా అని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం సరే మరి ప్రభుత్వ ఉత్తర్వుల్లో తెలుగును ఎందుకు ద్వితీయ భాషగా ఎందుకు చేర్చలేదు అంటు ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుని  పసి మనసులను తెలుగు భాష నుంచి దూరం చేయడం సరికాదన్నారు. జాతీయ విద్యా విధానం తూచా తప్పకుండా పాటించి మీ గౌరవం రాష్ట్ర గౌరవాన్ని పెంచాలని అంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖలో వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr