రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ వేళ‌ల్లో స‌డ‌లింపులు చేశారు.క‌రోనా పాజిట‌వ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆంక్ష‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌డ‌లిస్తుంది.తూర్పు,ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలు మిన‌హా అన్ని జిల్లాలో రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఇచ్చింది. తూర్పు,ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఉద‌యం ఆరుగంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ స‌డ‌లింపులు ఇచ్చింది.ఈ రెండు జిల్లాలో సాయంత్రం ఆరుగంట‌ల‌కే దుకాణ‌లు మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.పాజిటివిటీ రేటు 5శాతం లోపు వ‌చ్చే వ‌ర‌కు  రెండు జిల్లాల్లో ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని పేర్కొంది.మిగిలిన జిల్లాలో ఉద‌యం ఆరుగంట‌ల నుంచి రాత్రి 10గంట‌ల వ‌ర‌కు ఆంక్ష‌ల‌ను స‌డ‌లించారు.9గంట‌ల‌కు షాపులు మూసివేయాల‌ని 10 గంట‌ల నుంచి ఉద‌యం ఆరుగంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.సీటుకు సీటుకు మ‌ధ్య ఖాళీ ఉండేలా సినిమా హాళ్లు తెరుచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.రెస్టారెంట్లు,జిమ్స్‌,క‌ళ్యాణ‌మండ‌పాలు ఇలా అన్ని చోట్లా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించి తెరుచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది.శానిటైజ‌ర్‌,మాస్క్‌,భౌతిక దూరం త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగించాల‌ని ప్ర‌భుత్వం సూచించింది.కోవిడ్ విస్త‌ర‌ణ‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకోవాలని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు.

క‌రోనా సెంక‌డ్ వేవ్ విజృంభించ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ఠిన‌మైన ఆంక్ష‌ల‌ను విధించింది. కేసులు ఎక్కువ‌గా వ‌స్తున్న స‌మ‌యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.ఉద‌య ఆరు గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌రకు మాత్ర‌మే దుకాణాల‌కు అనుమ‌తి ఇచ్చింది. రాష్ట్రంలోని ప్ర‌తిగ్రామంలో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేశారు. దాదాపుగా ప‌దిహేన రోజుల‌పాటు ఈ నిబంధ‌న‌లు పెట్టారు.త త‌రువాత క‌ర్ఫ్యూ వేళ‌ల్లో ప్ర‌భుత్వం మార్పులు చేప‌ట్టింది. ఉద‌యం ఆరుగంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు నిబంధ‌న‌లు పెట్టింది.ఇలా క‌రోనా కేసుల‌ను బ‌ట్టి క‌ర్ఫ్యూ వేళ‌ల్లో మార్పులు చేసింది. ఇప్పుడు కేసులు సంఖ్య భారీగా త‌గ్గ‌డంతో ఆంక్ష‌ల‌ను మ‌రింత‌గా స‌డ‌లింపులు చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నైట్ క‌ర్ఫ్యూ మాత్ర‌మే అమ‌ల్లో ఉంది.అయితే క‌రోనా కేసులు త‌గ్గుముఖం పట్టిన‌ప్ప‌టికి ప్ర‌జ‌లు మాత్రం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్,శానిటైజ‌ర్ ఉప‌యోగించాల‌ని సూచిస్తున్నారు.మార్కెట్లు,దుకాణాల వ‌ద్ద భౌతికదూరం పాటించాల‌ని తెలిపారు.మూడ‌వ ద‌శ ముప్పు పొంచి ఉండ‌టం,కొత్త వేరియంట్లు బ‌య‌ట‌ప‌డుతుంటంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: