తెలంగాణలో రాజ‌కీయాలు ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియ‌మించింది.నెల‌ల త‌ర‌బ‌డి పీసీసీ ప్రెసిడెంట్ నియ‌మ‌కాన్ని వాయిదా వేస్తూ వ‌చ్చిన‌ అధిష్టానం చివ‌రికి రేవంత్‌రెడ్డిని ప‌ద‌వి వ‌రించింది.అయితే రేవంత్ రెడ్డి 2018 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌లో చేరడంతో ఆయ‌న్ని కాంగ్రెస్ నేత‌లంతా జూనియ‌ర్‌గానే చూశారు.2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొండంగ‌ల్ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా రేవంత్ పోటీ చేసి ఓడిపోయారు.ఆ ఆ త‌రువాత జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రేవంత్ కి ఎంపీ టికెట్‌ని కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం.అది కూడా దేశంలో పెద్ద పార్ల‌మెంట్‌గా పేరుగాంచిన మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నుంచి రేవంత్ బ‌రిలోకి దిగి భారీ మెజార్టీతో గెలిచారు.గ‌తంలో టీడీపీలో ఉన్న‌ప్పుడు కూడా రేవంత్ మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా పోటీచేయాల‌ని భావించిన అప్పుడు స‌మీక‌ర‌ణాలు కుద‌ర‌క‌పోవ‌డంతో కొడంగ‌ల్ నుంచి పోటీ చేశారు.
ఎంపీగా గెలిచిన త‌రువాత రేవంత్‌రెడ్డి దూకుడును పెంచారు. రాష్ట్రంలోని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై రేవంత్ యుద్దం చేస్తున్నారు.ఇటీవ‌ల రేవ‌త్ రైతు స‌మ‌స్య‌ల‌పై పాల‌మూరు జిల్లాలో పాద‌యాత్ర కూడా చేశారు.ఆ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. రేవంత్ రాజ‌కీయ జీవితమంతా ప్ర‌తిప‌క్షంలోనే గ‌డిపోతుంది.ప్ర‌భుత్వం అలుపెరుగ‌కుండా పోరాటం చేస్తున్న రేవంత్‌కి ఏఐసీసీ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో ఇప్పుడు తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఊపిరిపోసుకుంటుంది. సీనియ‌ర్ నేత‌ల‌ను వ‌రుసుగా క‌లుస్తూ త‌న మార్క్ రాజ‌కీయాన్ని రేవంత్ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే పీసీసీ పీఠంపై అశ‌లు పెట్టుకున్న నేత‌లు మాత్రం రేవంత్‌తో ఎడ‌మోహం పెడ‌మోహంగానే ఉన్నారు.అయిన‌ప్ప‌టికి వారంద‌రిని రేవంత్ క‌లుస్తూ త‌న బాధ్య‌త‌ల స్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. రేవంత్ యాక్ష‌న్ ప్లాన్ భారీగానే ఉన్నా వీరంతా ఎంత వ‌ర‌కు స‌హ‌క‌రిస్తారో చూడాల్సి ఉంది.
ఇటు మ‌రోవైపు రేవంత్ అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే గాంధీభ‌వ‌న్ రూప‌రేఖ‌లు మారిపోతున్నాయి.గాంధీభ‌వ‌న్‌లో వాస్తుని పూర్తిగా మారుస్తున్నారు.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న స‌మయంలో గాంధీభ‌వ‌న్‌కి రంగులు వేసి కార్యాల‌యాన్ని కొత్త‌గా మార్చారు.మ‌ళ్లీ ఇప్పుడు రేవంత్ ఎంట్రీతో గాంధీభ‌వ‌న్ కార్పోరేట్ కార్యాల‌యంలా మారిపోయింది.గాంధీభ‌వ‌న్ ప్రాగ‌ణంలో పూర్తిగా సిమెంట్ రోడ్డుని నిర్మించారు. పీసీసీ అధ్యక్షుడితో పాటు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్య‌ద‌ర్శుల‌కు,ఇత‌ర అనుబంధ విభాగాల‌కు ప్ర‌త్యేకంగా గ‌దుల‌ను కేటాయించండ‌తో పాటు అన్ని స‌దుపాయ‌లు క‌ల్పించేలా మార్పులు చేశారు.గ‌త ఏడేళ్లుగా గాంధీభ‌వ‌న్‌లో నేత‌ల హ‌డావిడి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. 2014 ఎన్నిక‌ల్లో 20 మందికి పైగా ఎమ్మెల్యేలు గెలిచ‌నా..2018 ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది పార్టీని వీడారు.మొన్న‌టివ‌ర‌కు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి కూడా క్యాడ‌ర్‌లో జోష్ నింప‌లేక‌పోయారు. ఇప్పుడు రేవంత్ ఎంట్రీతో గాంధీభ‌వ‌న్‌లో ప్ర‌తిరోజు కార్య‌క‌ర్త‌ల‌తో కిట‌కిటలాడుతుంది.
త్వ‌ర‌లో రేవంత్ పాద‌యాత్ర చేప‌డుతుండ‌టంతో పాద‌యాత్ర‌కు భారీగా యాక్ష‌న్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. నాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి చేసిన విధంగా పాద‌యాత్ర చేయాల‌ని రేవంత్ భావిస్తున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని తిడితే కొడ‌తామంటూ ఇప్ప‌టికే టీఆర్ఎస్ మంత్రుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారేన‌ని రేవంత్ క్యాడ‌ర్‌కి సందేశ‌మిస్తున్నారు.రేవంత్ పాద‌యాత్ర చేసి అధికారంలోకి వ‌స్తే మ‌రో వైఎస్ఆర్ అవుతార‌నేది క్యాడ‌ర్‌లో టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: