అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్ లో ఎన్నో ఊహించని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసినమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.  అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసిన బీజేపీకి ప్రస్తుతం వరుస షాకులు ఇస్తుంది మమతా బెనర్జీ. అటు బిజెపి పార్టీకి చెందిన ఎంతో మంది నేతలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ఎన్నో వ్యూహాలను రచిస్తున్నారు.  అదే సమయంలో ఇక అధికారంలోకి వచ్చిన తర్వాతమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా సంచలనం గా మారిపోతున్నాయి.



 ఇక ఇటీవల మరోసారి సీఎం మమత తీసుకున్న నిర్ణయం అటు బీజేపీ కి ఊహించని షాక్ ఇచ్చింది. అంతేకాదు పశ్చిమబెంగాల్ రాజకీయాలకు ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. పశ్చిమ బెంగాల్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇక పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడు కి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇదే ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నాయి అన్ని పార్టీలు.  ప్రతిపక్ష పార్టీకి ఎంత తక్కువ మెజారిటీ వచ్చిన ఇక ఆ పార్టీకి చెందిన సభ్యుడికే పీఏసీ చైర్మన్ పదవిని అప్పు చెబుతూ వస్తున్నారు  కానీ ఇటీవలే మమత తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత ముకుల్ రాయ్ ని ఇటీవలే పిఎసి చైర్మన్గా నియమిస్తూ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. అయితే మమత నిర్ణయం కాస్త బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. అయితే బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ముకుల్ రాయ్. టెక్నికల్ గా చూసుకుంటే ఇక ముకుల్ రాయ్ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే గానే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక ముకుల్ ని పీఏసీ చైర్మన్ గా చేసి  ప్రతిపక్ష పార్టీలకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలి అనే ఆనవాయితీని పాటించాను అని మమత చెప్పుకునేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే మమత తీసుకున్న నిర్ణయంపై బిజెపి ఎమ్మెల్యే సువెందు అధికారి మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: