సర్క్యూట్ హౌస్ లో ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అవంతితో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు ఈ రోజు భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణ పై చిర్చించారు. అంతే కాకుండా ఢిల్లీలో జంతర్ మంత‌ర్ వద్ద చేయబోయే ఆందోళనల‌ పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఇక కార్య‌క్రమంలో వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి మాట్లాడుతూ....నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. అయితే దీనిని వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల బాటలో తీసుకు వెళ్లేందుకు, ప్రయత్నించాలి కానీ ప్రైవేటు పరం చేయడం సరైన నిర్ణ‌యం కాద‌ని త‌మ‌ నినాదం అని చెప్పారు. ఈక్విటీ  లోన్ గా మార్చాలి, రుణ భారం  తగ్గించాలి, క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని విజ‌య సాయి రెడ్డి కోరారు.

ఒడిస్సా ఆంధ్ర బోర్డర్ సాలూరు , కొటియా ప్రాంతంలో ఐరన్ గనులు ఉన్నాయని వాటిని కేటాయిస్తే సరిపోతుందంటూ వ్యాఖ్యానించారు. కొత్త ఉక్కు శాఖ, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి త్వ‌ర‌లోనే వినతిపత్రం ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అధికారపక్షం మినహా అన్ని పక్షాల రాజకీయ నాయకులను కలిసి వారి సహకారం తీసుకోవాలని ఈ స‌మావేశంలో విజ‌య సాయి రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా అటు రాజ్యసభ లోక్ స‌భ‌లో పోడియం వద్ద ఆందోళన చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద రెండు రోజులు ఆందోళన చేయాల‌ని... స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడే అన్ని పార్టీలతో అక్కడ మద్దతుగా ఆందోళన చేస్తామ‌ని చెప్పుకొచ్చారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము చిత్తశుద్ధితో పని చేస్తామ‌ని విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ల‌ను ఎస్ఎఐఎల్,  ఎన్ఎండీసీ లో విలీనం చేస్తే  బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఇక ఈ స‌మావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ....కేంద్రం స్టీల్ ప్లాంట్ విషయంలో ఏకపక్షంగా ప్రైవేటీకరించాలని ఆలోచన చేసిందన్నారు. ముఖ్యమంత్రి ఇప్ప‌టికే కార్మికుల‌ తో సమావేశమయ్యారని.. రెండుసార్లు ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. నాలుగు లక్షల కోట్ల విలువ చేసే భూమిని, ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని ఆలోచన చేస్తున్నార‌ని మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా  ఏ నిర్ణయం చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. పార్లమెంటు బయట , పార్లమెంట్ లోపల స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామ‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: