టూరిజం శాఖ పై మంత్రి  అవంతి శ్రీనివాస్ రావు  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీ పై ఆయన అధికారులతో కీలక చర్చలు చేశారు. ఇక ఈ సమీక్ష వివారాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ రావు మాట్లాడారు.  స్పోర్ట్స్ కోటా లో ఖాళీ గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి అవంతి. ఉద్యోగాల భర్తీలో రెండు శాతం మేర స్పోర్ట్స్ కోటాకు రిజర్వేషన్ ఉందని చెప్పుకొచ్చారు మంత్రి అవంతి. ఈ మేరకు స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయాల్సిన పోస్టుల జాబితా సిద్దం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు పంపినట్లు మంత్రి అవంతి స్పష్టం చేశారు.

ఇక టూరిజం అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని  నాలుగు టూరిజం సర్క్యూట్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అవంతి వెల్లడించారు. అలాగే.... రాయల సీమ, కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర సర్క్యూట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మూడు సర్క్యూట్లల్లో ఒబెరాయ్ హోటళ్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు మంత్రి అవంతి.  అంతేకాదు... ఫారెస్ట్ టూరిజం, టెంపుల్ టూరిజం వంటి వాటిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నామని తెలియజేశారు.  ప్రతి జిల్లాలో టూరిజం ఫెస్టివల్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ప్రభావం లేకుంటే  ఆంధ్ర ప్రదేశ్‌ లోని ప్రతి జిల్లాలోనూ క్రీడా పోటీల నిర్వహిస్తామని స్పష్టం చేశారు మంత్రి అవంతి.

 అలాగే... రాష్ట్రం లోని గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ప్రొత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రగతి కోసం వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటుందన్నారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా... సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కాగా... ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై విపక్షాలు నిరసన గళం వినిపిస్తున్న సంగతి విదితమే. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌ లోని నిరుద్యోగుల్లోనూ  కాస్త అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: