ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో మూడు నెలల్లో క్యాబినెట్ ను  సమూలంగా ప్రక్షాళన చేయనున్న సంగతి తెలిసిందే. జగన్ రెండున్నరేళ్ల క్రితం చెప్పినట్టుగానే తన క్యాబినెట్ లో 90 శాతం మంది మంత్రులను రిప్లే స్‌ చేసేందుకు ముహూర్తం సిద్ధం చేశారు. వచ్చే దసరాకు ఏపీ కేబినెట్ లో ఇప్పుడున్న మంత్రుల స్థానంలో 15 మంది కొత్త మంత్రులు వస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే కొత్త‌గా మంత్రి ప‌ద‌వులు ఆశిస్తోన్న వారు ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు జగన్ కొత్త మంత్రివర్గంలో స్థానం ఖరారు అయినట్లే అని తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఎస్టీ ఎమ్మెల్యేలలో సీనియర్ అయిన బాల‌రాజు నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

వైసీపీ నుంచి ఆయ‌న మూడు సార్లు గెలిచారు. పైగా జగన్ కోసం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన బాలరాజు తన ఎమ్మెల్యే పదవిని వదులుకొని ఉపఎన్నికలకు వెళ్లి మరి భారీ మెజారిటీతో విజయం సాధించారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు 2019లో నేనే మంత్రి పదవి రావాల్సి ఉన్నా... జగన్ అప్పటి సమీకరణల నేపథ్యంలో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి కి మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కట్టబెట్టారు.

పుష్ప శ్రీవాణి ని తప్పించటం ఖాయం అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె ప్లేస్ ను బాలరాజు తో భర్తీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి . జగన్ కు వీర విధేయుడిగా ఉండడంతోపాటు... వివాదరహితుడిగా ఉండటం , పార్టీ కోసం పదవులు త్యాగం చేయటం ఇవన్నీ ఆయ‌న‌కు ప్ల‌స్ కానున్నాయి. ఇక జిల్లాలో సమీకరణాలు కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: