వైసీపీలో ఇప్పుడు అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది.
జగన్‌ అక్రమాస్తుల కేసులో బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగబోతోంది. ఈ విచారణలో ఇప్పటికే ఎంపీ రఘురామ కృష్ణంరాజు, జగన్ ఇద్దరూ లిఖితపూర్వకంగా  వాదనలు సమర్పించారు. సీఎం హోదాలో జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన వాదన వినిపించారు.


అయితే ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పిటిషన్‌ వేశారని జగన్‌ వాదించారు. అయితే ఈ కేసు విచారణలో సీబీఐ వాదనల విషయం మొదటి నుంచి ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మొదట్లో ఈ కేసులో తాము వాదనలు వినిబించబోమని సీబీఐ చెప్పింది. కోర్టు ఏది సమంజసమని భావిస్తే అది చేయొచ్చని చెప్పింది. ఆ తర్వాత కోర్టు ఏదో ఒకటి తేల్చి చెప్పండని ఆదేశించేసరికి.. లిఖితపూర్వక వాదనల సమర్పణకు ఈ నెల 14న సీబీఐ గడువు కోరింది.


ఇప్పుడు సీబీఐ కోరిన 10 రోజులు గడువు ముగిసింది. ఇప్పుడు కేసు మరోసారి విచారణకు వస్తోంది. మరి ఇవాళ సీబీఐ ఏమని వాదిస్తుందో అన్న అంశం ఉత్కంఠ భరితంగా మారింది. ఇవాళ  సీబీఐ లిఖిత పూర్వకంగా తన వాదనల సమర్పించనుంది. అయితే సీబీఐ కోర్టు ఏం చెబుతుందన్నది ఇంట్రస్టింగ్ పాయింట్. అసలు జగన్ బెయిల్ రద్దుపై మొదట సీబీఐ ఎందుకు వాదనలు వినిపించనని చెప్పింది. జగన్ పై అనేక కేసులు నమోదు చేసిన సీబీఐ ఆయన బెయిల్ రద్దుకు ఎందుకు పట్టుబట్టడం లేదు..అనేది కూడా ఆసక్తికరమే.


అంతే కాదు.. ఈ కేసులో జగన్ బెయిల్ రద్దు చేస్తూ సీబీఐ కోర్టు తీర్పు వస్తే ఏం జరుగుతుందన్నది కూడా ఆసక్తికరమే. జగన్ బెయిల్ రద్దయితే ఏపీ సీఎం ఎవరు అవుతారు.. ఆ తర్వాత ఏపీ రాజకీయం ఏ మలుపులు తిరగబోతోందన్నది కూడా ఆసక్తికరం అవుతుంది. చూడాలి.. ఏం జరుగుతుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: