నిన్న మొన్నటి వరకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా పని చేసిన కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయం ఇప్పుడు యూటర్న్ తీసుకోబోతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్త‌మ్‌ సారథ్యంలోనే 2018 ముందస్తు ఎన్నికలను కాంగ్రెస్ ఎదుర్కొంది. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకుంది. మహా యోధానుయోధులు అనుకున్న నాయకులు అందరూ చిత్తుగా ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది కారెక్కేశారు. అయితే హుజూర్ నగర్ లో మాత్రం కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి చావు తప్పి కన్నులొట్టబోయినట్లు కేవలం ఏడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే అనంతరం జరిగిన లోక్‌స‌భ ఎన్నికల్లో కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఎంపీగా కూడా ఉత్త‌మ్‌ హోరాహోరీ పోరులో 23 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

అనంతరం హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేయగా అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్త‌మ్‌ భార్య పద్మావతి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పద్మావతి పై టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఏకంగా 40 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి కంచుకోట కరిగిపోయింది. ఇక ఇప్పుడు దృష్టి అంతా ఆయన పాత నియోజకవర్గం అయిన‌ కోదాడ పై ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి గతంలో కోదాడ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ ఆయ‌న‌ భార్య పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో పద్మావతి కేవలం 700 ఓట్ల స్వల్ప తేడాతో మాత్రమే ఓడిపోయారు.

ఇక ఇప్పుడు ఉత్త‌మ్ వచ్చే ఎన్నికల్లో హుజూర్ న‌గర్ నుంచి కాకుండా కోదాడ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన కోదాడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉత్త‌మ్ షాక్ అయ్యే సంఘటన జరిగింది. ఈ సమావేశంలో కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో కోదాడ కాంగ్రెస్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలని.. ఉత్త‌మ్ ఇక్కడ పోటీ చేస్తే వార్‌ వన్ సైడ్ అవుతుందని చెప్పారు.  ఉత్త‌మ్‌ను కాకుండా మరో అభ్యర్థిని ఇక్కడ బరిలోకి దింపితే ఊరుకోమని తెగేసి చెప్పారు. ఈ పరిణామాలు చూస్తుంటే కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో కోదాడ అసెంబ్లీ నుంచి పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: