గత సంవత్సరమే జరగాల్సిన ఒలింపిక్ గేమ్స్ 2020 కరోనా ఉదృతి కారణంగా నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కరోనా కాస్త శాంతించిన తరువాత అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య సమావేశం నిర్వహించి 2021 లో జరపాలని నిర్ణయించింది. కానీ అప్పటికే ప్రపంచ దేశాలు కొన్ని ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. అప్పటికే ఉన్న సమాచారం ప్రకారం రెండు మరియు మూడవ కరోనా వేవ్ లు వచ్చే అవకాశం ఉన్నందున ఒలింపిక్ గేమ్స్ ఈ సారికి రద్దు చేయాలని అభిప్రాయపడ్డాయి. అయితే జపాన్ దేశ ప్రజలు సైతం ఒలింపిక్ క్రీడలను జరుపుకోవడానికి నిరాకరించారు. ఎందుకంటే క్రీడాకారులు అనేక దేశాల నుండి వస్తారు కాబట్టి, కరోనా వ్యాప్తి చెందుతుందని భావించారు.

అయితే ఆ మాటలేవీ ఖాతరు చేయని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య పది రోజుల క్రితం ముందుగా అనుకున్న జపాన్ దేశంలోని టోక్యో వేదికగా అట్టహాసంగా ఒలింపిక్ గేమ్స్ ను ప్రారంభించారు. కానీ ఇప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. నిన్నటి సమాచారం ప్రకారం జపాన్ లో మొత్తం 10,177 కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా కరోనా సోకి చనిపోయినవారు 5 మందిగా ఉంది. కేవలం ఒకవారం రోజులలో ౫,020 కేసులు మరియు త్రీ మరణాలు జరిగినట్లు సమాచారాన్ని బట్టి అర్ధమవుతోంది. మాములుగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కాక ముందు అంటే జులై 12 నుండి టోక్యో లాక్ డౌన్ లో ఉంది. దీని ప్రకారం చూస్తే కొత్తగా యూపిఐ నివేదిక ప్రకారం జపాన్ లో కరోనా కేసుల దాదాపు 87 శాతం పెరిగింది. అంటే జపాన్ లో మొత్తం కరోనా కేసులు సంఖ్య 937,293 కు చేరింది.

కానీ టోక్యో ఒలింపిక్ గేమ్స్ చీఫ్ తొషిరో నిన్న మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు పెరిగిన కరోనా కేసులకు ఒలింపిక్ గేమ్స్ తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పది రోజుల నుండి జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్ కు 206 దేశాల నుండి 11,000 మంది క్రీడాకారులు వచ్చారు. అయితే ఈ ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొన్న అందరికీ కరోనా టెస్టులు నిర్వహించగా వారి నుండి అతి తక్కువ పోజిటివిటీ మాత్రమే నమోదయిందని వీరు తెలిపారు. ఇంకా ఈ ఒలింపిక్ గేమ్స్ ముగియడానికి ఈ రోజుతో కసలుపుకుని వారం రోజులు ఉండగా ఇంకా ఎన్ని కేసులు దీని కారణంగా పెరుగుతాయో చూడాల్సిన అవసరం ఉంది...
 


మరింత సమాచారం తెలుసుకోండి: