తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి తనదైన వాక్చతుర్యంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత నాగార్జున సాగర్ నియోజకవర్గంకు సంబందించిన హాలియా టౌన్ లో జరిగిన భారీ బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడాడు.ఆయన తెలంగాణ దళిత జాతిని దేశం లోనే గొప్ప దళిత జాతిగా చేసి చూపిస్తానని కెసిఆర్ అనటం జరిగింది. చాలా మంది  దళితులకు దళిత బంధు సరిగ్గా అమలు జరుగుతుందా అంటూ మాటల తుటాలు పేల్చుతున్నారని ఆయన విమర్శించారు.గతంలో దళితులకు కూసింత మంచి చేసిన ముఖమైతే ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడే వారు కాదు అని కెసిఆర్ అన్నారు.కేసీఆర్ గారు ఒక్కసారి చెప్పడం జరిగితే అది కచ్చితంగా చేసి తీరుతారు అని చెప్పడం జరిగింది.గతంలో  కెసిఆర్ చెప్పిన హామీలు అన్ని ఎలా చేసి చూపించానో మన అందరి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందని ప్రజలను ఉద్దేశించి అనటం జరిగింది.

70 సంవత్సరాలుగా దళిత జాతిని ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోలేదని సీఎం కేసీఆర్‌ విమర్శించడం జరిగింది.దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టాలని తనను ఎవరు అడగడం జరగలేదని ఎంతో గొప్ప ఆలోచన చేసి ఈ పథకాన్ని రూపొందించామని కేసీఆర్‌ తెలపడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 లక్షల వరకు దళిత కుటుంబాలుంటే అందులో సుమారు 12 లక్షల వరకు దళిత కుటుంబాలు అర్హులుగా ఉండనున్నారని వారందరికీ సుమారు రూ. పది లక్షలు అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన అందరూ దళితులకు ఈ పథకం ద్వారా రూ. 10 లక్షలు అందజేస్తామన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తామని కేసీఆర్ చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున దళిత బంధు కోసం నిధులు కేటాయించబోతున్నామని చెప్పారు. ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో సుమారు 100 కుటుంబాలకు పైగా రూ. 10 లక్షల సాయం అందజేయనున్నామని సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. ఎన్ని కోట్లు అయిన ఖర్చు చేయటానికి వెనుకాడబోమని అన్నిటికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.కేసీఆర్ ఏమన్నారు అంటే …
ప్రజల ఆశీస్సులు దేవుని దీవెనలు ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రగతి బాటలో తాము పని చేస్తామని చెప్పారు.తెలంగాణ ప్రగతిని జీర్ణించుకోలేకే కొందరు  పిచ్చి వాళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు పట్టించుకోనని చెప్పడం జరిగింది. విద్యుత్,  మిషన్ భగీరథ, సంక్షేమ కార్యక్రమాలు వంటివి చెప్పినవన్నీ చేసి చూపించానని తెలియజేశారు. 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినప్పుడు జానారెడ్డి లాంటి వారు అది సాధ్యం అయ్యే పని కాదని విమర్శ చేసారని చేస్తే టీఆర్ఎస్ చేసి చూపిందని కెసిఆర్ చెప్పారు. జానా రెడ్డికి  నాగార్జున సాగర్ ఉపఎన్నికలలో  మీరే బుద్ధి చెప్పారు అని తెలిపారు. దళిత బంధు పథకాన్ని కూడా విజయవంతం చేస్తామని కెసిఆర్ చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: