మాజీమంత్రి వైసీపీ కీలక నేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణ కొనసాగుతోంది.  ఇప్పటికే ఎంతో మంది అనుమానితులను సీబీఐ విచారించింది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సిబిఐ దూకుడు పెంచింది. అనుమానితులు అందరినీ కూడా క్రమక్రమంగా విచారించడం మొదలుపెట్టింది..



 అయితే ప్రస్తుతం సీబీఐ వివేకా హత్య కేసులో ముమ్మరంగా విచారణ జరుపుతున్న సమయంలో ఒక సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలోనే ఈ విచారణ కొనసాగించాలని అంటూ అటు ప్రతిపక్ష టిడిపి డిమాండ్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇక వివేకా హత్య కేసులో రోజురోజుకు సరి కొత్త విషయాలను సిబిఐ వెలుగులోకి తెస్తున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఈ హత్య కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివేకానంద రెడ్డి ఇంటి వాచ్మెన్ రంగయ్యను కోర్టులో హాజరు పరచి వాంగ్మూలం తీసుకున్నారు. పలు కీలక విషయాలను సేకరించారు.


 ఇదిలా ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసు లో ఈ రోజు ఒక కీలక వ్యక్తిని సిబిఐ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు సీబీఐ విచారణకు పులిచింతలకు చెందిన డ్రైవర్ కలందర్ హాజరు కాబోతునట్లు సమాచారం. ఇప్పటికే విచారణకు ఎర్ర గంగిరెడ్డి,దస్తగిరి,  ఉమాశంకర్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇక ఈ కేసు విచారణలో భాగంగా మొదటి సారి డ్రైవర్ కలందర్ ను సిబిఐ బృందం విచారించ బోతుంది. ఇక ఈ విచారణలో ఏదైనా కీలక విషయాలు బయటపడతాయా అన్నదానిపై కూడా ప్రస్తుతం ఎంతో చర్చనీయాంశంగా మారింది. మరి డ్రైవర్ కలందర్ సిబిఐ విచారించి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తుంది అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: