రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే శత్రువులున్నారా అంటే నిజమనే చెప్పాలి. ఎందుకంటే మాములుగా రేవంత్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన వారు కావడం ఒక కారణం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి విషయంలో ఎక్కువగా నమ్మకాలు పెట్టుకుంటోందని వాదనలు అప్పుడే ప్రారంభమయ్యాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పని తీరుపై విసుగు చెందిన అధిష్టానం పీసీసీ పగ్గాలను వేరొకరికి అప్పచెప్పాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీని కోసం చాలా కాలం అలా సాగదీస్తూ ఉండడంతో ఈ ఆపదవిపై చాలా మంది ఆశావహులు తయారయ్యారు. తద్వారా వారిలో వారికే పొత్తులు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పాలి. ఆఖరుకు టీడీపీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ ని కట్టబెట్టింది.

ఇక అది మొదలు కాంగ్రెస్ లో వ్యతిరేక వర్గం ఏర్పడింది. అది మరెవ్వరో  కాదు, ఈ పీసీసీ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఈయన ఏ స్థాయిలో రేవంత్ రెడ్డిపై మరియు పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారంటే, త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీకే మద్దతు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు కామెంట్స్ బహిర్గతంగా చేయడంతో అది మరింత రచ్చగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడం సవాలుతో కూడుకున్న విషయమని చెప్పాలి.

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక వస్తున్న మొదటి ఎన్నిక హుజురాబాద్. కాబట్టి తన సత్తా ఏమిటో చూపించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ప్రణాళికలతో జోరుగా ప్రచారాలను కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెడుతున్నాడు. ఇది రేవంత్మ రెడ్డికి తొలి పరీక్ష కావడంతో అందరి దృష్టి అతనిపైనే నెలకొంది. మరి ఎంత వరకు అటు బీజేపీ మరియు తెరాస లను ఢీకొట్టగలడన్న విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: