రైతులందరికీ ఎంతగానో చేయూతనివ్వాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా రైతులందరూ ఎంతగానో ప్రయోజనం పొందుతున్నారు. అయితే రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం కూడా ఒకటి. ఇక ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయంగా ప్రతి పంటకు ₹2000 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఈ రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో ప్రతి ఏటా జమ చేస్తూ వస్తోంది.



 ఈ క్రమంలోనే అటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ద్వారా అటు రైతులందరికీ కాస్త ఉపశమనం దొరుకుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో రైతులు పిఎం కిసాన్ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు అని చెప్పాలి. ఇప్పటికే రైతులు పలు విడతలుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు. ఇక ప్రస్తుతం వర్షాకాలం పంటలకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం రేపు జమ చేయడానికి సిద్ధమైంది.



 దీనికి సంబంధించిన డబ్బులు రేపు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి . అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని ఇప్పటికే కూడా ఎంతో మంది రైతులు పొందలేకపోతున్నారూ.అర్హత ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రైతులు కేంద్రం ఆర్థిక సహాయాన్ని పొందలేకపోతున్నారు. అయితే ఇలా మీరు లబ్ధిదారులుగా ఉండి పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని పొందే లేకపోతే మీ బ్యాంకు ఎకౌంట్ లేదా మీ జిల్లా వ్యవసాయ అధికారిని వెంటనే సంప్రదించడం ఎంతో ఉత్తమం లేదా పీఎం కిసాన్ helpline  అయినా 155261 లేదా.. టోల్ ఫ్రీ నెంబర్ 1800115526 ఆ నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: