బీసీ ఫైర్ :  ఆధిపత్యం పోరులో ఓడిపోయినదెవ్వరు?
caste war between two wings in ap and tg

అటు తెలంగాణ
ఇటు ఆంధ్రా
ఆధిపత్య పోరు గురించే
మాట్లాడుతోంది


కొత్త పదవులు,కార్పొరేషన్ చైర్మన్ల రాక అన్నవి తమకు ఎటువంటి లబ్ధినీ చేకూర్చలేదని బీసీ సంఘం చెబుతున్నా,ఆ మాట జ గన్ పట్టించుకుంటారా లేదా?అన్నది ఓ ప్రశ్న.డబ్బులున్నా లేకున్నా పదవి ముఖ్యమనుకునే రాజకీయ నిరుద్యోగులు తమ కా ర్పొరేషన్ల బాగు కోసం శ్రమిస్తారని అనుకోలేం కనుక బీసీ సంఘం బాధ కేవలం బాధగానే మిగిలిపోవడం ఖాయం.వాస్తవానికి సా మాజిక వర్గాల సంస్కరణ అన్నది కార్పొరేషన్ ఏర్పాటుతో సాధ్యం కాకపోయినా కాస్తయినా నిధులుంటే కొన్ని పనులకు అయినా ప్రాధాన్యం ఇవ్వవచ్చు అన్నది ఓ భావన.కానీ బీసీ సంఘాలు ఇప్పుడు ఆధిపత్య కులాలను తిట్టి ఎన్నికల సమయంలో మాత్రం వారికే నేరుగా మద్దతు ఇస్తున్నాయని,అందుకే వారిని ఇప్పుడు తిట్టడంలో అర్థమే లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

నిధులు లేనప్పుడు
నియమాకమాలు ఎందుకు
అన్న ప్రశ్న ఎదురౌతోంది?

కులాల కార్పొరేషన్ల వల్ల ఏమీ రాదని,ఏమీ లాభం లేదని తేలిపోయింది.వీటికి నిధుల కేటాయింపు అన్నది ఇప్పుడు అంత తేలికై న విషయం కాదు.కానీ అదే పనిగా కొన్ని కులాలను తెరపైకి తెచ్చి వారి ఆధిపత్యాన్ని తిట్టడం వల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎ క్కువ.ఎంతలేదన్న వెనుకబడిన వర్గాలను నడిపేది ఆంధ్రాలో ఆ రెండు కులాలే..వాటిపై పోరుకు తగ్గ ఆర్థిక బలాలు బీసీ సంఘా లకు ఉందా? లేకా అవి రాజకీయ పార్టీలను తిట్టిపోయడంతోనే కాలం వెళ్లదీస్తున్నాయా అన్నది కూడా కీలకం.

కులాల పేరిట
తిట్టుకోవడంలో
సహేతుకత లేదని
రాజ్యాధికార సాధన సాధ్యం
కాదని తేలిపోయింది?

ఇప్పటిదాకా కులాలకూ,కులాలకూ మధ్య అంత వైరం లేదు.ఉండదు కూడా!కానీ ఆధిపత్య కులాల పేర్లు తెరపైకి తెచ్చి బీసీ సం ఘాలు ప్రతిసారీ తమ ఉనికిని చాటుకుంటున్నాయని ఓ విమర్శ.రాజ్యంలో మా ఓట్లూ మా సీట్లూ అన్నీ మావే అని చెప్పినప్పు డు ఆ ప్రకారం ప్రత్యక్ష పోరుకు సిద్ధపడడం, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించడం అన్నవి ముఖ్యం.కానీ ఇప్పుడు కేవలం ఎన్నికల సమీపిస్తున్న సమయంలోనో లేదా ఉనికికి ప్రమాదం అనుకుంటున్న సమయంలోనో బీసీ సంఘాలు మాట్లాడి తరువాత నిశ్శబ్దం పాటిస్తున్నాయన్న విమర్శ కూడా ఉంది.అటు జగన్ కానీ ఇటు కేసీఆర్ కానీ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యం ఏం టన్నది ముందుగా గణాంకాలతో చెప్పాల్సింది సంబంధిత సంఘాలే.కేవలం నిధులు లేవన్న సాకుతో తిడితే కుదరదు.నిధుల సా ధనకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం కూడా సంఘాల  బాధ్యతే!


మరింత సమాచారం తెలుసుకోండి:

ap