రోడ్లన్నీ కంచెలు ముళ్ల కంచెలు
ఎవ్వరూ బయటకు రాకండి

ఎదుట వంద చెక్  పోస్టులు

మీరు స్థానికులా అయితే
మీ ఆధార్ కార్డు చూపాకనే వెళ్లండి

ఉద్యమ కారులా అయితే తన్ని పంపండి
ఈడ్చుకు రండి గృహ నిర్బంధం చేయండి
 మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా?

రాజధానిలో ఉద్రిక్తతలు నెలకొంటే అబ్బే అవేం లేవనే అంటారా? మనుషులను పశువుల కన్నా హీనంగా కొడితే అబ్బే! అదంతా శాంతి భద్రతల పరిరక్షణలో భాగమే అంటారా? గొంతు నులిపి మహిళ అని కూడా చూడకుండా పైశాచికంగా ప్రవర్తిస్తే అది కూడా డ్యూటీలో భాగమే కదా డ్యూడ్ ఇదే స్పీడు ఇదే స్పిరిట్ అన్నింటా చూపండి ఆనందిస్తాం..ఇదే వేగం కొన్ని మంచి పనులకు ఉపయోగించండి ఇంకా ఆనందిస్తాం. శక్తి మీది కాదు ఈ దేశ ప్రజలది అధికారం మీది కాదు ఈ దేశ పౌరులది అని గ్రహించకుండా మీరు అన్యాయంగా ప్రవర్తిస్తూ .. న్యాయం అయిన కోర్కెల సాధనే తప్పు అంటే పౌరు డూ పోలీసూ కొట్టుకుంటే ప్రేక్షక పాత్రలో ప్రభుత్వాలు ఉండడం గతంలోనూ ఇప్పుడూ ఎప్పటికీ పతనానికి నాంది కాక తప్పదు! అని హక్కుల కార్యకర్తలు ఘోషిస్తున్నారు.
రాజ్యంలో తమ బాధలు తాము చెప్పుకునేందుకు న్యాయస్థానం నుంచి దేవాలయం వరకూ విన్నపం ఇచ్చేందుకు చేసే ప్రయత్నం.. లక్ష్మీ నృసింహ స్వామి కి బాధలు చెప్పుకోవాలి.. అన్నది ఓ సంకల్పం.. హైకోర్టు కు చేరుకుని తమ గోడు వినిపించాలి అన్నది ఓ లక్ష్యం.. ఇది పార్టీలు నడిపిస్తున్న ఉద్యమం అని సులువుగా అంటున్నారు. ఇప్పుడు  ఆ పార్టీల పెద్దలను మినహాయించి సామాన్యుల కోణంలో ఆలోచిద్దాం. ఆదివారం.. పోలీసుల మోహరింపు.. రాత్రి నుంచే కర్ఫ్యూ. మరి! మీరు  ప్రజా స్వామ్య దేశంలో అందరినీ సమానంగా చూస్తున్నాం అని ఎలా అనుకుంటారు.. వారి గోడు వారికి చెప్పనివ్వడం లేదు అన్నది
సుస్పష్టం అయ్యాక అందరికీ న్యాయం చేస్తాం అన్న మాట ఎలా అనగలరు ?

ఆధార్ కార్డు ఉంటే మీరు తిరగవచ్చు.. మీరు అసలు ఈ కంచె దాటి పోవద్దు.. మీ దంతా పెట్టుబడి దారుల ఉద్యమం ఇలాంటివి వంద చెప్పండి ఎవ్వరూ కాదనరు కానీ.. సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనం మాత్రం ఏ మాత్రం అంగీకారం కాదు. వాళ్ల గోడు వాళ్లు వినిపించకుండా మీ మీ రక్షణ తంత్రాలను ఉపయోగించి, మీ మీ శక్తినంతా ఉపయోగించి ఇలా నియంత్రిచడం కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందే తప్ప  తగ్గదు..  గ్రామాల్లో అంత మంది పోలీసులు వచ్చి హల్ చల్ చేస్తుంటే భయం కాక ఏముంటుంది? అయినా కూడా వాళ్లు మాట్లాడుతున్నారు. పోరాడుతున్నారు. గొంతు నులిపి మాట్లాడవద్దు అని చెప్పినా కూడా తాము వెనుకంజ వేయబోం అనే చెబుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: