రాజకీయ నాయకులు అన్న తర్వాత ఇక పార్టీ కార్యకర్తలను జనాలను ఆకర్షించటానికి ఎన్నో ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఇక ఇలా ప్రసంగాల్లో ఎప్పుడూ కొత్తగా మాట్లాడి అందరినీ ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ రాజకీయ నాయకుల ప్రసంగాలు చేసినప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందిm ఎందుకంటే పొరపాటున ఏదైనా నోరుజారి మాట్లాడారు అంటే ఇక ఆ తర్వాత ఒకవైపు జనాలు మరోవైపు ప్రత్యర్థి పార్టీల నేతలు ఇక ఆ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం సెటైర్లు వేయడం లాంటివి చేస్తూ ఉంటారు.



 ఇలా ప్రస్తుతం కరోనా వైరస్ విషయంలో ఎంతో మంది రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు పలుమార్లు హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు బీజేపీ నేత కరోనా వైరస్ ఫై ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిపోయారు. దీంతో బిజెపి నేత చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని.. కరోనా ప్రాణాంతకమైనది అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ ఉంటారు.



 కానీ ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాత్రం విచిత్ర వ్యాఖ్యలు చేశారు. శివుడు సీఎంగా.. విష్ణు రాష్ట్ర పార్టీ చీప్ గా ఉన్న మధ్యప్రదేశ్లో ఇక కరోనా వైరస్ ఏం చేయలేదు అంటూ తరుణ్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్.. బిజేపి రాష్ట్ర చీఫ్ గా విష్ణుదత్ శర్మ ఉన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం కార్యకర్తల నుంచి చప్పట్లు రాబట్టుకోవడానికి మాత్రమే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఈ విచిత్ర వ్యాఖ్యలు చేశారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp