ఇండియా క్రీడాకారులు గత వారంలో ముగిసిన టోక్యో ఒలింపిక్స్ 2020 లో గత ఒలింపిక్స్ కంటే ఉత్తమమయిన ప్రదర్శన కనబరిచారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఒలింపిక్స్ లో పలు రికార్డులు సృష్టించారు. అన్నింటికన్నా చాలా ముఖ్యమైనది ఆఖరి రోజున జావెలిన్ త్రో మెన్స్ విభాగంలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించి భారతదేశ ఖ్యాతిని మరింత పెంచాడు. ఈ గోల్డ్ మెడల్ తో సగర్వంగా ఇండియా ఒలంపిక్ గేమ్స్ ను ముగించింది. నీరజ్ చోప్రా విజయం పట్ల భారతదేశం అంతా ఎంతో సంతోషంగా చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా నీరజ్ చోప్రాపై ప్రశంశల వర్షం అలాగే నజరానాలు భారీగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ కు సంబంధించిన ఒక విషయం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎంతో కష్టపడి ఎన్నో వృధా ప్రయాసలు పడి ఒలింపిక్ పతకాన్ని క్రీడాకారులు గెలుచుకున్నారు. ఈ పతకాలు వ్యర్ధమైనవని వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. వ్యర్థమైనవి అంటే అవి విలువలేనివని కాదు బాబోయ్.
ఈ పతకాలన్నీ పనికి రాని వ్యర్ధ పదార్ధాలతో తయారు చేశారట. ఒలింపిక్ గేమ్స్ లో పతకం సాధించిన వారందరికీ బహూకరించిన పతకాలన్నీ కూడా ఎలక్ట్రానిక్ వ్యర్ధ పదార్దాలతో తయారు చేసారు. ఇందులో ఇచ్చిన పతకాల కోసం వీరు కలెక్ట్ చేసిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాల కోసం ఎంత సమయాన్ని కేటాయించారో, ఎంత మంది కష్టపడ్డారో మనకు అర్ధమవుతుంది. ముఖ్యంగా వాడేసిన మొబైల్స్ మరియు లాప్ టాప్ లనుండి తీసుకున్న పదార్ధాల నుండి తయారుచేశారు. మన ప్రపంచంలో వీటి ద్వారా ఏర్పడే చెత్త ఎంత ఉంటుందో ఊహించడానికే కష్టం. ఈ పరికరాల నుండి వచ్చే పనికి రాని చెత్త లో కోట్ల రూపాయలకు సంబంధించిన బంగారు, వెండి లోహాలు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ కూడా ఎంతో మందికి వీటి విలువ తెలియక పడేస్తూ ఉంటారు. కానీ కొత్త విషయాలను కనిపెట్టడంలో ముందుంటే జపాన్ దేశం ఈ సారి విచిత్రమైన ఈ పద్దతికి శ్రీకారం చుట్టింది.

 జపాన్ దేశం అంతా ఒక టీమ్ రెండు సంవత్సరాల పాటు తిరిగి అందరినీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇవ్వమని అడిగి పతకాలను తయారుచేయడంలో సక్సెస్ అయింది. ఇలా కలెక్ట్ చేసిన వ్యర్ధాల నుండి దాదాపుగా 80 టన్నులు సమకూరింది. దీనిని మళ్ళీ ప్రాసెస్ చేయడంతో 32 కిలోల బంగారు, 3,492 కిలోలు వెండి మరియు 2,199 కిలోల కంచు వచ్చింది. మాములుగా కూడా ఇలా పాడయిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను బయట చెత్తలాగా పడేయడం వలన వాతావరణానికి చాలా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. కేవలం 2019 సంవత్సరంలోనే 5.36 కోట్ల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు లభ్యమయ్యాయి. వీటి వలన మరింత ముప్పు ఏర్పడుతుండడంతో రానున్న కాలంలో జపాన్ ను ఆదర్శంగా తీసుకుని మరిన్ని కొత్త మార్గాలకు ఇతర దేశాలు శ్రీకారం చుడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: