టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అసలు...టీడీపీకి కలిసిరాని నియోజకవర్గం ఏదైనా ఉందటే అది చంద్రగిరి అని చెప్పొచ్చు. చంద్రగిరి...చంద్రబాబు పుట్టిన గడ్డ అనే విషయం తెలిసిందే. అసలు చంద్రబాబు తొలిసారి ఎన్నికల బరిలో దిగిందే చంద్రగిరి నుంచే. 1978లో కాంగ్రెస్ తరుపున చంద్రబాబు బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1983లో చంద్రబాబు, టీడీపీ చేతిలో ఓడిపోయారు.
 
1985 ఎన్నికల్లో పోటీ చేయని చంద్రబాబు,  ఆ తర్వాత టీడీపీలో చేరి వరుసగా కుప్పం బరిలో దిగుతూ వస్తున్నారు. అయితే బాబు సొంత గడ్డ చంద్రగిరిలో మాత్రం టీడీపీకి గెలుపు దక్కడం చాలా కష్టమైపోయింది. కేవలం ఆ పార్టీ మూడు సార్లు మాత్రమే చంద్రగిరిలో గెలిచింది. అంటే అక్కడ టీడీపీ పరిస్తితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. గత రెండు పర్యాయాల నుంచి చంద్రగిరిలో వైసీపీ తరుపున చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు.

అయితే ఇక్కడ చెవిరెడ్డి విజయాలకు చంద్రబాబు బ్రేక్ వేయలేకపోతున్నారు. అభ్యర్ధులు మారినా సరే పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. 2014లో టీడీపీ తరుపున సీనియర్ నాయకురాలు గల్లా అరుణకుమారి పోటీ చేసి ఓడిపోగా, 2019 ఎన్నికల్లో పులివర్తి నాని పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు చంద్రగిరి ఇంచార్జ్‌గా పులివర్తి నాని పనిచేస్తున్నారు. తనకు సాధ్యమైన మేర నాని పనిచేసుకుంటూ వెళుతున్నారు.


కానీ చెవిరెడ్డి ఎమ్మెల్యేగా దూసుకెళుతున్నారు. రాష్ట్రంలో మెరుగైన పనితీరు కనబర్చే ఎమ్మెల్యేల్లో  చెవిరెడ్డి టాప్ టెన్‌లో ఉంటారని చెప్పొచ్చు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చెవిరెడ్డి పనిచేస్తున్నారు. పైగా ప్రభుత్వ పథకాలు ఆయనకు బాగా ప్లస్ అవుతున్నాయి. దీంతో చెవిరెడ్డికి చెక్ పెట్టడం నాని వల్ల కాదనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ చెవిరెడ్డికి తిరుగుండదని తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే చంద్రగిరిలో చెవిరెడ్డి హవా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికైతే చంద్రగిరిలో నానికి మళ్ళీ షాక్ తగిలేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: