ఏపీ సీఎం జగన్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.. కోర్టుల్లో షాకులు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.. జగన్ పై నమోదైన చార్జ్ షీటులపై విచారణ పదేళ్లకు పైగా సాగుతూనే ఉంది. అది ఇంకా ఓ కొలిక్కి రాలేదు.. కానీ.. ఇప్పుడు ఆ విచారణ కొలిక్కి వస్తుందా.. మరోవైపు జగన్ ఇప్పటికీ బెయిల్ పైనే ఉన్నారు. ఆయన బెయిల్ ఏ క్షణమైనా రద్దు కావచ్చు.. ఆయన బెయిల్ రద్దు చేయించాలని కొందరు కంకణం కట్టుకున్నారు.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.. మరి ఇప్పుడు వారి ప్రయత్నాలు ఫలించబోతున్నాయా.. ఏమో.. ఏం జరుగుతుందో..


ఏదేమైనా.. ప్రస్తుతం జగన్‌కు డేంజర్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి.. తాజాగా సీబీఐ, ఈడీ కోర్టు  సీఎం జగన్‌కు సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 22న విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. వాన్‌పిక్ ఈడీ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... జగన్‌తో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవికి సమన్లు జారీ చేసింది. వీరితో పాటు ఎమ్మెల్యే ధర్మాన, ఐఆర్‌టీఎస్ అధికారి కె.వి.బ్రహ్మానందరెడ్డికి సమన్లు ఇచ్చింది. పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్‌, మాజీ ఐఏఎస్‌లు ఎం.శామ్యూల్, మన్మోహన్‌సింగ్‌కూ  సమన్లు ఇచ్చింది.


మరోవైపు లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఈడీ ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు... ఆ కేసులోనూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమన్లు ఇచ్చింది. ఇదే కేసులో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డికి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, జె.గీతారెడ్డికి, పారిశ్రామిక వేత్త ఐ.శ్యాంప్రసాద్ రెడ్డికి, ఐఏఎస్ అధికారి డి.మురళీధర్ రెడ్డికి, రిటైర్డ్ ఐఏఎస్ లు బీపీ ఆచార్య, శామ్యూల్ కు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఎండీ బాలాజీ, వ్యాపారవేత్త బీపీ కుమార్ బాబుకు సమన్లు ఇచ్చింది. ఈ కేసులోనూ సెప్టెంబరు 22న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.


ఇదిలా ఉంటే జగన్‌ ను జైలుకు పంపడమే నా లక్ష్యం అంటూ భీష్మించిన సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం త్వరలోనే తన కలసాకారం అవుతుందంటున్నాడు.. ఇక జగనంటే గిట్టని ఓ పత్రికాధిపతి కొన్ని రోజులుగా అదే పనిగా జగన్ జైలుకు వెళ్తే అంటూ ఊహాగానాలు అల్లేస్తున్నారు. ఏమో.. ఎక్కడో తేడా కొడుతోంది. ఏదో జరగబోతోందనిపిస్తోంది.. చూద్దాం.. ఏం జరుగుతుందో..


మరింత సమాచారం తెలుసుకోండి: