మామూలుగా పెళ్లి అయిన తర్వాత భారీగా బహుమతులు రావడం సహజం పెళ్లికి వచ్చిన బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు ఎవరికి తోచిన విధంగా వారు బహుమతులు ఇస్తూ ఉంటారు అయితే పెళ్లి కి ఎన్ని బహుమతులు వచ్చినప్పటికీ అటు వరుడు వధువు స్నేహితులు ఇచ్చే వినూత్నమైన గిఫ్టులు మాత్రం కాస్త హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఈ జనరేషన్లో అయితే స్నేహితుల పెళ్లికి ఎంతో వినూత్నంగా ఆలోచించిన విచిత్రమైన చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్.  ఇలా కొన్ని కొన్ని సార్లు పెళ్లికి స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ షాప్ కి గురి చేస్తూ ఉంటాయి ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.



 స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ చూసి వరుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు ప్రస్తుతం కరుణ వైరస్ కారణంగా తమ ఆర్థిక పరిస్థితి బాలేదని కాస్త అర్థం చేసుకోవాలి అంటూ చెబుతూ ఒక వినూత్నమైన గిఫ్ట్ ఇచ్చారు స్నేహితులు పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది కొయ్యలగూడెం కు చెందిన రాము అనే యువకుడికి వివాహం జరిగింది అయితే వివాహానికి ఇక విచిత్రమైన గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నారు స్నేహితులు ఈ క్రమంలోనే ఒక పది రూపాయల స్టాంప్ పేపర్ తీసుకుని దానిపై కొన్ని హామీలు ఇచ్చి సంతకాలు చేశారు



 ఇంతకీ ఆ బాండ్ పేపర్ లో ఏం రాసి ఉంది అని అంటారా.. ప్రియ మిత్రుడు కరోతు రాముకి మిత్ర బృందం వ్రాసి ఇచ్చు హామీ పత్రం. మిత్రమా నీ వివాహము జరుగుట మాకు ఎంతో ఆనందకరం. ఈ శుభ సందర్భంలో నీకు మంచి బహుమతి బహుకరించాలని అనుకున్నాము. కానీ కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా పనులు లేక చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాము. ఇప్పుడు నీకు బహుమతి ఇచ్చే అవకాశం లేనందున త్వరలో డ్వాక్రా డబ్బులు గాని, అమ్మఒడి డబ్బులు కానీ, రైతు భరోసా కానీ ఎటువంటి డబ్బులు మా అకౌంట్‌లో పడిన మేమందరం ఆ డబ్బులతో నీకు మంచి బహుమతి ఇస్తామని వ్రాసి ఇచ్చుచున్నాము. అలా ఇవ్వని పక్షాన నీవు తీసుకొను చట్టపరమైన ఏ చర్యలకైనా మేము పూర్తి భాద్యత వహిస్తామని అంగీకరిస్తున్నాము.. అంటూ ఆ పేపర్లో రాశారు దీంతో ఇది చదివిన కొత్తజంట అవాక్కయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: