రేవంత్ సమర్థతపై కాంగ్రెస్ భవిష్యత్ ఉంది. షర్మిల సమర్థతపై వైఎస్సార్టీపీ మనుగడ ఆధారపడి ఉంది. ఇద్దరూ ఒకే సామాజికవర్గం కు చెందిన నేతలే! ఇద్దరికీ దళితులంటే ప్రేమనే..! ఆ తరహా రాజకీయాలు నడుపుతున్నవారే! షర్మిల తన జెండానే అంబేద్కరి జంకు దగ్గరగా రూపొందింపజేసి వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంటే, రేవంత్ మాత్రం ఇంకొన్ని మంచి మాటలు చెప్పి దళితు లకు చేరువ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి! తెలంగాణలో ఉండే రెడ్లకు ఎవరిపై నమ్మకమో చూద్దాం.



ముందుగా తెలంగాణ రెడ్లకు కానీ ఆంధ్రా రెడ్లకు కానీ రాజశేఖర్ రెడ్డి అంటేనే నమ్మకం.అందులో సందేహం లేదు. చావు,బతుకుల మధ్య ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవం,జవం నింపిన నేత ఆయన. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన తిరుగులేని నేతనే! ఆయనకు ఎదురెళ్లి నిలిచిన నేతలూ లేరు. ఆయనకు ప్రత్యామ్నాయంగా ఇవాళ చేతి గుర్తు పార్టీలో ఉన్న నాయకులు ఎవ్వరూ ఎదగలేరు. ఎదగరు కూడా! ఉత్తమ్, జానా లాంటి రెడ్డి లీడర్లు ఏమయ్యారో తెలిసిందే కదా! ఉత్తమ్ కు రేవంత్ అంటే గుస్సా..జానాకు వయో భారం ఈ రెండూ కారణాలే కాంగ్రెస్ కు పెద్ద విఘాతం కావొచ్చు. అలా అని జానా రెడ్డి మనుషులు రేవంత్ వెనుక నడుస్తారని చెప్ప లేం. ఉత్తమ్ చెప్పినా చెప్పకున్నా తనకంటూ ఓ అజెండాను ఎప్పుడో సెట్ చేసుకున్నాడు ఆయన. ఇక రేవంత్ ఓ విధంగా పార్టీలో ఒంటరి. మరి! రేవంత్ ను రెడ్లు నమ్ముతారా? నమ్మరు..ఓటు కు నోటు కేసు తరువాత పరిణామాల్లో ఆయనపై సాను భూతి ఉంది కానీ అది ఓటు వరకూ రాదు. చంద్రబాబు  ఏజెంటు కనుక కమ్మ సామాజికవర్గం నమ్ముతుందా అంటే నమ్మదు. ఎందుకంటే రేవంత్ ను మించిన లీడర్లు తమ సొంత సామాజిక వర్గంలో తయారు కావాలన్న ఆశ ఒకటి, రేవంత్ మించే స్థాయిలో ఇప్పుడున్న కమ్మ సామాజిక వర్గ నేతలు పనిచేయాలన్న ఆలోచన ఒకటి వారిలో ఉంది కనుక రేవంత్ నాయకత్వంపై వారికి పెద్దగా నమ్మకాలు లేవు. హైద్రాబాద్ లో ఉన్న కమ్మ సామాజిక వర్గం అంతా ఎప్పుడో గులాబీ దండు సభ్యులుగా మారిపోయారు కూడా! పెట్టుబడులూ, ఆస్తులూ ముఖ్యం కనుక ఆ విధంగా చంద్రబాబు చెప్పినా రేవంత్ మాటను మాత్రం హైద్రాబాద్ రెడ్లు కానీ కమ్మలు కానీ వినరు.



ఇక షర్మిల విషయానికి వస్తే ఆమెనే పార్టీకి పెద్ద మైనస్ అన్న వార్తలే ఎక్కువ. ఆమె మాట తీరు కారణంగానే ఎక్కువ మంది నా యకులు పార్టీని వీడేందుకు ఇష్టపడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి మాదిరిగా ఆమె నడవడి లేదని, ఆయన అందరినీ గౌరవించే వా రని, ఆ స్థాయిలో నడవడి లేని కారణంగా  ఆమె ఎవ్వరికీ చెందని వ్యక్తిగా ఉండిపోతున్నారని  వైఎస్సార్టీపీ నాయకులు చేస్తు న్న ఆరోపణ. అందుకే రెడ్లకు మరో బలమైన నాయకత్వం అవసరం ఉన్నా కూడా షర్మిలను సమర్థించే స్థితిలో ఇవాళ ఆ వర్గంకు చెందిన ఓటర్లు లేరు. అలానే రెడ్లకు చెందిన పరిశ్రమల విషయమై కూడా టీఆర్ఎస్ సానుకూలంగానే ఉంది. వేధింపు ధోరణులు లేవు. యజమాని ఏ ప్రాంతం వాడయినా సరే టీఆర్ఎస్ స్వాగతించేందే కానీ పొమ్మనలేదు. పొగబెట్లలేదు. సమగ్ర తెలంగాణ అభివృద్ధిలో కార్పొరేట్లను భాగం చేయాలన్న తలంపులో ఇంతకాలం కేటీఆర్ పనిచేశారు. అవన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేవే. కానీ షర్మిల పారిశ్రామిక ప్రగతిపై కానీ, ముఖ్యంగా సెటిలర్లపై కానీ సొంత సామాజికవర్గ నేతలను ఇటుగా తీసుకురావడంలో కానీ లేదా చేరిక విషయమై కానీ దృష్టి సారించడం లేదని స్పష్టం అవుతోంది. రెడ్లకు వైసీపీ కానీ వైఎస్సార్టీపీ కానీ ఉంటే మేలు అన్న భావన ఉన్నా కూడా ఆ విధంగా నాయకత్వ లక్షణాలు ఇప్పుడొస్తున్న రేవంత్ లో కానీ కొత్తగా పార్టీ  ఆరంభించిన షర్మిలలో కానీ లేవు. ప్రత్యా మ్నాయ నాయకత్వ లక్షణాలు అటు రెడ్లకు కానీ ఇటు కమ్మ సామాజిక వర్గానికి కానీ సమీప భవిష్యత్ లో లభించే అవకాశాలే లేవు అన్నది ఇవాళ సుస్పష్టం. కనుక రెడ్ల ఓట్లు చీలితే చీలొచ్చు కానీ ఆ లాభం కూడా కేసీఆర్ గూటికే చేరి పోవడం అన్నది ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: