కరోనా పరిస్థితుల కారణంగా అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌ను ఆయా రాష్ట్రాల్లో విడతల వారీగా తొలగించారు. ఇప్పుడు అక్కడక్కడా పాక్షికంగా తప్పితే ఏ రాష్ట్రంలోనూ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు కావడం లేదు. తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. అయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి గుండెకాయ వంటి జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మాత్రం ఇంకా అనధికారిక లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. విజిటర్స్ కు నో ఎంట్రీ అని బోర్డులు పెట్టి మరీ ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్‌లోని కోటి 20 లక్షల జనాభాకు అవసరమైన, అత్యవసర సేలందించే కార్యాలయం జీహెచ్‌ఎంసీ. అలాంటి ఆఫీసు లాక్‌డౌన్‌ ముగిసినప్పటికీ.. తమకు ఇంకా కరోనా భయం పోలేదని, అందుకే అనధికారిక లాక్‌డౌన్‌ను కంటిన్యూ చేస్తున్నాం అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు నగరవాసులను విస్మయానికి గురిచేస్తోంది. గత పాలక మండలి హయాంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎప్పడూ సందడిగా ఉండేది.  సందర్శకులతో హడావుడిగా కనిపించేది. జీహెచ్ంఎంసీ ఎన్నికలకు ముందు అప్పటి మేయర్ బొంతు రామ్మెహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్   నిత్యం ఫేషీలో ప్రజలకు అందుబాటులో ఉండేవారు. కట్ చేస్తే గత 8 నెలల నుంచి బల్దియాలో సీన్ రివర్స్ అయ్యిందని ప్రజలు చెబుతున్నారు. కమిషనర్ మొదలుకుని విభాగాధిపతుల వరకు ఎవరూ  సీట్లలో ఉండటం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. కరోనా భయంతో సందర్శకులను కలిసేందుకు నిరాకరిస్తున్నారు.

ప్రస్తుతం బల్దియాలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. పెద్దగా పనులేమీ జరగటం లేదు. అలాగని రొటీన్ మెయింటనెన్స్ పనులు, పౌర సేవల నిర్వహణను తనిఖీ చేసేందుకు ఫీల్డుకెళ్లారా? అంటే అక్కడా కనిపించడం లేదు. ఉదయం పదిన్నర నుంచి పదకొండు గంటల మధ్యన ఆఫీసుకు రావటం.. కాసేపు ఆఫీసులో గడిపి, అదృశ్యమైపోవటం బల్దియా అధికారులకు పరిపాటిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. తమ బాగోతం బయటకు తెలిస్తే ఇబ్బంది అవుతుందనో ఏమో కరోనా భయంతో సందర్శకులను కలిసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: