టీఆర్ఎస్ నాయ‌కులు మ‌రియు రేవంత్ రెడ్డి మ‌ధ్య వివాదం ముదురుతోంది. మంత్రి మల్లారెడ్డి పై రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న ఆగ్రహం వ్య‌క్తం చేస్తూ స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ఘాటు వ్యాఖ్య‌ల‌తో రేవంత్ పై మ‌ల్లారెడ్డి ఫైర్ అవ్వ‌డంతో రేవంత్ అనుచ‌రులు కాంగ్రెస్ నాయ‌కులు ఆయ‌న ఇంటిని ముట్ట‌డించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదిలా ఉండ‌గానే తాజాగా రేవంత్ పై మ‌రో టీఆర్ఎస్ పీయూసీ చైర్మెన్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డిది ఐర‌న్ లెగ్ అని ఆయ‌న పార్టీలో ఉంటే పార్టీ స‌ర్వ‌నాశ‌నం అవుతుంద‌ని పీయూసీ చైర్మెన్ జీవ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. చంద్రబాబు ద‌గ్గ‌ర చ‌ప్రాసీగా ప‌నిచేసి ఆయ‌న‌ను ఏపీకి పంపించారని విమ‌ర్శించారు. రేవంత్ రెడ్డి టెంట్- స్టంట్- పర్సెంట్- ఆప్సెంట్ డ్రామా ఆపితే మంచిదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటలు- మూటలు- ముఠాలు చేసే వైఖరంటూ మండి ప‌డ్డారు. పెద్ద నాయకులు లేనిది చూసి దొరికింది దోచుకోవడమే రేవంత్ వైఖరని అన్నారు. ఒక్క మల్లారెడ్డి- మైనంపల్లి మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు- వందమంది ఎమ్మెల్యేలు మాట్లాడితే తట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. పవర్ లోకి రాలేమని ముందే గ్రహించి ఇష్టమొచ్చినట్లు రేవంత్ మాట్లాడుతున్నారని మండి ప‌డ్డారు.

మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో- మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అని కాంగ్రేస్ పార్టీ నేతలు మరవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పై రేవంత్ రెడ్డి పరుష్పాదజలం గురించి రాహుల్ గాంధీకి- సోనియాగాంధీ కి లేఖ రాశానని జీవ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాయడం చివరి అస్త్రం అంటూ వ్యాఖ్యానించారు. లేఖ తరవాత అయినా రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మేము కూడా కాంగ్రెస్ కొడుకుల్లారా అని అనగలమంటూ మండిపడ్డారు. ఎన్నో ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ.... కేసీఆర్ పథకాలు ఇస్తే ఇప్పుడు ఇన్ని కష్టాలు మాకెందుకు వస్తుండే? అంటూ వ్యాఖ్యానించారు. దళితుల ఇండ్లలో నిద్రచేసి వాళ్ల ఇంట్ల నీళ్లు కాకుండా కిన్లీ వాటర్ తాగుతుండు రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.

థర్డ్ క్లాస్ మాటలు రేవంత్ రెడ్డి మానుకోవాలని జానా రెడ్డి అన్నారు. అధికార పార్టీ నేతలు భూములు కబ్జా చేస్తే ఆధారాలతో బయటపెట్టాలని రేవంత్ రెడ్డికి చెప్పారు. రేవంత్ రెడ్డి ఎవరి పెంపుడు కుక్కవో అందరికి తెలుసంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మల్కాజిగిరి ఎంపీగా  చంద్రబాబు దయవల్ల రేవంత్ రెడ్డి గెలవడం నిజం కాదా? అంటూ జానా రెడ్డి ప్ర‌శ్నించారు.రేవంత్ రెడ్డి మాటల్లో చూపిస్తే- మేము చేతల్లో చూపిస్తూ నాలుక కోస్తామంటూ జానారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి  పేరును ఎక్కడైనా ప్రస్తావించారా..? అంటూ జానారెడ్డి ప్ర‌శ్నించారు. సొంత పార్టీ లో లీడర్లు రేవంత్ ను ఎవ్వరూ కేర్ చేయడం లేదని ఆక్రోశంతో మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అదే ప్రగతి భవన్ స్థలం నుంచే పాలన చేశారు కదా? అప్పుడు ఎందుకు బౌజన పేరు పెట్టలేదు.? అంటూ రేవంత్ ను ప్ర‌శ్నించారు. కాంగ్రెస్- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బౌజన బోర్డులు పెట్టి తెలంగాణలో మాట్లాడాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్ అవతారం ఎత్తారంటూ జానారెడ్డి వ్యంగ్యాస్త్రాలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: