ఆప్ఘానిస్థాన్ లో మహిళలు వణికిపోతున్నారు. ఇప్పటికే ఇళ్ల నుంచి మహిళలు బయటకు రావొద్దని తాలిబన్లు హుకుం జారీ చేశారు. ఆప్ఘాన్ కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు వహీదా ఫైజీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను తలచుకొని కన్నీటి పర్యంతమైంది. తన దేశం అంటే తనకెంతో ప్రేమనీ..  కానీ తానిక్కడ ఉండలేనంటోంది. ఈ గాలి పీల్చలేనంటోంది.  తాను వాళ్ల కంట పడితే చంపేస్తారని వాపోయింది.

ఆఫ్ఘానిస్థాన్ ను వశం చేసుకున్న తాలిబన్లకు మహిళలను గౌరవించడం రాదని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్దీన్ అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని, మహిళల భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి ఆఫ్ఘాన్ మహిళలు ఇంట్లోనే ఉండటం మంచిదని సూచించారు. మహిళలను గౌరవించడంలో తమ వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చారు.

ఆప్ఘానిస్థాన్ లో రక్తపాతం సృష్టిస్తున్న తాలిబన్లకు తలొగ్గేది లేదని పంజ్ షేర్ సైనికులు స్పష్టం చేశారు. వారితో రాజీ పడబోమని.. అంతు చూస్తామని ప్రకటించారు. అందుకు ఆప్ఘానిస్థాన్ ఆర్మీ మాజీ కమాండర్ వీరితో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. అలాగే పంజ్ షేర్ సైనికులకు దేశ ప్రజల మద్దతుతో పాటు పొరుగు దేశం తజకిస్థాన్ సైతం సపోర్ట్ చేస్తోంది. పంజ్ షేర్ సైనికులు సైతం తాలిబన్లతో కలిసిపోనున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి.


మరోవైపు తాలిబన్లు.. ఉగ్రవాదులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోపంతో రగిలిపోతున్నారు. కాబూల్ ఎయిర్ పోర్టులో అమెరికా సైనికులే లక్ష్యంగా జరిగిన బాంబు పేలుళ్లపై స్పందించారు. వైట్ హౌస్ నుంచి ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారిని ఎప్పటికీ క్షమించేది లేదనీ.. వెంటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామంటున్నారు. 12మంది సైనికులు చనిపోవడంతో అమెరికా ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది. మొత్తానికి మహిళల పట్ల తాలిబన్ నాయకుడి మాటలు.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నాయంటున్నారు కొందరు

 


 


మరింత సమాచారం తెలుసుకోండి: