కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ పూర్తి కాగా త్వరలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికే మూడో వేవ్ స్టార్ట్ అయిందంటూ కొన్ని కథనాలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జనాలు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే వానాకాలం వ్యాధులూ షురూ అయ్యాయి. కొవిడ్‌తో అస్వస్థతకు గురై జనాలు ఓ వైపు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఉండగా, మరో వైపు వైరల్ ఫీవర్ ప్రజలను వణికిస్తోంది. మూడో వేవ్ ముప్పు పొంచిన తరుణంలో వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా‌తో పాటు ఇతర వ్యాధులు జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. 

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ ఓపెన్ చేసేందుకుగాను ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ మరింత ఆందోళన కలిగించేలా కొవిడ్, వైరల్ ఫీవర్లు పొంచి ఉన్నాయి. ఓ అంచనా ప్రకారం అక్టోబర్ నాటికి కొవిడ్ కేసుల తీవ్రత పతాక స్థాయికి చేరుకోనుందట. ఎందుకంటే గతేడాది ఈ సమయంలో కరోనా పరిస్థితులతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులెదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో వైరల్ ఫీవర్స్ విజృంభణ పీక్స్‌కు చేరే చాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే వానాకాలం దోమలకు మంచి సీజన్ కాగా, దాంతో మలేరియా, డెంగ్యూ జ్వరాల కేసులు పెరగొచ్చు. అయితే, వైరల్ ఫీవర్ లక్షణాలు కరోనాను పోలి ఉండడంతో చాలా మంది ఆ మందులు వేసుకొని నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నట్లుగా తెలుస్తోంది. 

కొవిడ్ లేదా వైరల్ ఏదనేది తెలియాలంటే వెంటనే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని ప్రతీ ఒక్కరు గుర్తించాల్సిన అవసరముంది. ఇటీవల కాలంలో డెంగ్యూ కేసులు కూడా పెరుగుతుండటం గమనార్హం. కరోనా మహమ్మారి దెబ్బకే జనాలు, దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే.. మరోవైపు విషజ్వరాల విజృంభణతో ఇంకా ఇబ్బందులే ఉంటాయి. మొత్తంగా మాయదారి వ్యాధులన్నీ ఒక దాని తర్వాత ఒకటి అటాక్ చేస్తున్నాయనే అభిప్రాయాలు జనం నుంచి వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: