ఏపీలో నిరుద్యోగులకు తియ్యటి వార్త. శాఖలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్.. జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 398ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. నేటి నుంచి 24వరకు దరఖాస్తు చేయవచ్చు. టెన్త్ పాసై ఐటీఐలో ఎలక్ట్రికల్, వైర్ మెన్ ట్రేడ్ క్వాలిఫై అయిన 18నుండి 35ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ స్టేట్ స్కిల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ కూడా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నిరుద్యోగుల కోసం మరో జాబ్ మేళాను ప్రకటించింది. మోర్ రిటైల్ ఇండియా, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, రైజింగ్ స్టార్స్ హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హీరో మోటార్ కార్ప్ లాంటి సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 3న జరిగే ఈ జాబ్ మేళా కోసం అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

టెలిమెడిసిన్ హబ్స్ లో ఒప్పందం ప్రాతిపదికన  స్పెషలిస్ట్ లు, జనరల్ డ్యూటీ డాక్టర్ల పోస్టులకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం ఖాళీలు 70ఉన్నాయి. స్పెషలిస్టులకు పీజీ, మెడికల్ ఆఫీసర్లకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతగా అర్హత నిర్ణయించారు. స్పెషలిస్టులకు లక్షరూపాయలు, మెడికల్ ఆఫీసర్లకు 53వేలుగా వేతనాన్ని నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 6 చివరి తేదీ.

మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో అంగన్ వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అంగన్ వాడీ కార్యకర్త, అంగన్ వాడీ సహాయకురాలు, మినీ అంగన్ వాడీ కార్యకర్త తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పదోతరగతి పాసైన స్థానిక మహిళలు ఈ పోస్టులకు అర్హులు. చిత్తూరు జిల్లాలో 484ఖాళీలున్నాయి. దరఖాస్తులకు ఈ నెల 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. మొత్తానికి ఈ వరుస నోటిఫికేషన్లు నిరుద్యోగుల్లో కొంత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఎలాగైనా జాబ్ ను సొంతం చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు.
















మరింత సమాచారం తెలుసుకోండి: