కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత దూకుడుగా రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాస్త సంతోషాన్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ లో ఎన్ని రోజులు సైలెంట్గా ఉన్న నాయకులు కూడా ఇప్పుడు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం నడుస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలను టార్గెట్గా చేసుకుని ఘాటు విమర్శలు చేస్తున్నారు. దీని దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఇబ్బంది పడుతుంది అని కామెంట్ లు వినపడుతున్నాయి. టిఆర్ఎస్ మంత్రుల కొంతమంది రేవంత్ రెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

మంత్రి మల్లారెడ్డి లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి గత వారం రోజుల నుంచి చేస్తున్న విమర్శలు దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా స్పందించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాస్త ఇబ్బంది పడుతున్నారు అని కామెంట్ లు ఎక్కువగా వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డికి పార్టీ కీలక నేత నుంచి సహకారం లభించడం లేదు అనే అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉండే కొంతమంది నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు. మాజీ ఎంపీ మల్లు రవి అలాగే కొంతమంది కీలక నాయకులు ఈ అంశంపై స్పందిస్తూ మంత్రి మల్లారెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎంపీలు reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని ప్రజల్లో ఆదరణ ఉన్న సరే మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయక పోవడం అలాగే రేవంత్ రెడ్డికి సహకారం అందించకపోవడం ఆందోళన కలిగించే అంశం. దీంతో రేవంత్ రెడ్డి కాస్త సీనియర్లను కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళ వద్ద కూడా కొంత సమాచారం పంపించి విమర్శలు చేయాలని విజ్ఞప్తి చేశారని అంటున్నారు. అయినా సరే వారి వద్ద నుంచి స్పందన మాత్రం కరువైంది అని కామెంట్ వినపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts