బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఇక ప్రతిరోజూ బీపీ, షుగర్ ను కంట్రోల్ చేసుకోవడానికి మందులతో కూడిన జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఉంటుంది. అంతేకాదు ఇక ఆహారం ఈ విషయంలో కడుపు కట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కరోజు మాత్రలు మింగకపోయినా బీపీ షుగర్ తో బాధపడుతున్న వారికి ప్రమాదమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అందుకే బిపి షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రతి రోజు మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అయితే పేద మధ్యతరగతి ప్రజలకు అయితే  బీపీ షుగర్ ను కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఎప్పుడు మందులు వాడటం కాస్త కష్టతరం గా మారుతూ ఉంటుంది.



 ఇక తరచూ మందులు కనుక్కోవడం కోసం భారీగా ఖర్చు చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ఇలాంటి వారికి ఇటీవలే ఏకంగా తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది.  ఒకవేళ బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మందులు కొనుక్కోవడానికి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే ఉండేవారికి తెలంగాణ ప్రభుత్వం చెప్పిన న్యూస్ ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి.  ఇక ప్రతి నెలా బీపీ, షుగర్ తో బాధపడుతున్న రోగులకు కిట్లు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కెసిఆర్ కిట్టు ఇస్తున్న మాదిరిగానే. బీపీ, షుగర్తో బాధపడుతున్న వారికి కూడా మెడికల్ కిట్లు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.


 ఇలా బీపీ షుగర్ రోగులకు ప్రభుత్వం అందించే కిట్ లో బీపీ షుగర్ కు సంబంధించిన నెలకు సరిపడా మందులతో పాటు వాటిని వినియోగించే సమాచారం కూడా పూర్తిగా ఉంటుంది. ఇక ఇలా బీపీ షుగర్ తో బాధపడుతున్న ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం లేకుండా వీటిని నెలనెలా అందించాలి అని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 25 లక్షల మంది బీపీ షుగర్ పేషెంట్లు ఉన్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: