ఇటీవల అమెరికా హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టిన తాలిబన్లకు మరోసారి అలాంటి అవకాశం ఇవ్వకుండా చేసింది అగ్రరాజ్యం. ఆప్ఘాన్ నుంచి తమ దేశ సైనికులు, పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తవగా వెళ్తూ వెళ్తూ మరో పనికూడా చేసింది. కాబూల్ ఎయిర్ పోర్టులో వదిలేసిన 73యుద్ధ విమానాలను నిర్వీర్యం చేసింది. అవి మళ్లీ ఎగరలేవనీ.. సైనిక వాహనాలను ఎవరూ నడపకుండా చేసినట్టు అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది.

ఆఫ్ఘానిస్థాన్ నుంచి ఇప్పటి వరకు లక్షా 23వేల మంది పౌరులను తరలించినట్టు అమెరికా ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది ఆప్ఘాన్ ప్రజలే ఉన్నట్టు యూఎస్ రక్షణ మంత్రి లూయిడ్ ఆస్టిన్ తెలిపారు. నిన్న మరో 6వేల మందిని తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు. అయితే ఆప్ఘానిస్థాన్ లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దాదాపు 2వేల 461మంది సైనికులను కోల్పోయినట్టు చెప్పారు. చాలా మంది క్షతగాత్రులైనట్టు చెప్పారు.

ఆప్ఘాన్ నుంచి 20ఏళ్లుగా కొనసాగుతున్న అమెరికా రక్షణ దళాల తరలింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. తమ సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి సోమవారం అర్థరాత్రి బయల్దేరినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ కన్నెత్ మెకంజీ ప్రకటించారు. ఆగస్ట్ 31లోపే తమ వాళ్లను తరలిస్తామని ఇటీవల అధ్యక్షుడు బైడెన్ ప్రకటించిన కారణంగా చివరి ఫ్లైట్ టేకాఫ్ అయింది. దీంతో తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు కానీ.. అక్కడున్న అమెరికా సైనిక వాహనాలు నిర్వీర్యం చేసివెళ్లేపోయింది అమెరికా.


మరోవైపు తాలిబన్లు ఆప్ఘానిస్థాన్ ను ఆక్రమించాక వారిని ఇంటర్వ్యూ చేసిన ఓ మహిళా జర్నలిస్ట్  ప్రాణ భయంతో దేశం విడిచి పారిపోయింది.టోలో న్యూస్ లో కొత్తగా చేరిన 24ఏళ్ల బెహెస్తా అర్ఘాంద్ ఈ నెల 17న తాలిబన్ల ప్రతినిధిని ఇంటర్వ్యూ చేసింది. ఇది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆమె తాలిబన్ల చేతిలో దాడికి గురైన మలాలాను కూడా ఇంటర్వ్యూ చేయడంతో ఆమె ప్రమాదంలో పడింది. దీంతో బెహెస్తా దేశం విడిచి వెళ్లిపోయింది.





మరింత సమాచారం తెలుసుకోండి: