వాస్త‌వానికి వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ, ఆ పార్టీ ఉన్న‌తికి తొలినాళ్ల నుంచి ఇప్ప‌టిదాకా ఎంతో స‌హ‌క‌రించిన విజ‌య‌మ్మ త‌న కుమార్తె ష‌ర్మిల వైపే మొగ్గు చూపుతున్నారు. ఓ ఆడ‌పిల్ల‌గా ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి పాద‌యాత్ర చేసిన చ‌రిత్ర ఉమ్మ‌డి రాష్ట్రంలో సైతం ఎన్న‌డూ లేద‌ని, జ‌గ‌న్ జైల్లో ఉన్న రోజుల్లో పార్టీని నిలిపిన ఘ‌న‌త, క్యాడ‌ర్ ను న‌డ‌పిన ఘ న‌త ఆమెదేన‌ని విజ‌య‌మ్మ భావిస్తున్నారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక త‌న‌కు గానీ ఆమెకు గానీ రాజకీయంగా ఎటువం టి ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంతో మ‌న‌స్థాపం చెంది ఒక్కొక్క‌రుగా పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు చేసిన స‌న్నాహాల్లో భాగంగా వైఎస్సా ర్టీపీ ఏర్పాటైం ది. కానీ జ‌గ‌న్ వ్యూహం మ‌రోలా ఉంది.



టీఆర్ఎస్ మాదిరిగా వైఎస్సార్సీపీని కుటుంబ పార్టీగా మార్చి సొంత వారికి ప‌ద‌వులు ఇవ్వ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని ఆయ‌న అం టున్నారు అని జ‌గ‌న్ వ‌ర్గీయుల మాట. అలా చేస్తే రాజ‌కీయంగా ఇంకా ఎక్కు వ విమ‌ర్శ‌లు ఎ దుర్కోవ‌ల‌సి వ‌స్తుంద‌ని ఆయ‌న భ యం. అదేవిధంగా సొంత సామాజిక వర్గంకు చెందిన మంత్రులకు గాని, ఇత‌ర ప‌ద‌వుల్లో ఉన్న వారికి గాని  జగన్ అంతగా ప్రోత్స హించారు. కొన్ని నామినేటెడ్ పదవులు, కొన్ని ప్రాధాన్య స్థానాలు తన సొంత సామాజిక వర్గంకు చెందిన వారికి ఇచ్చినప్పటికీ మంత్రివర్గంలో మాత్రం రెడ్డి సామాజిక వర్గం ప్రాధాన్యం అంతంత మాత్రమే! ఆ.. మాటకొస్తే ఇతర మంత్రుల బలం కూడా అంతంత మాత్రమే!



ఈ నేపథ్యంలో విజయమ్మ ఒకనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా నిలిచినటువంటి ఆంధ్ర నేతల సాయంతో పార్టీని ప్రారంభిం చాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కెవిపి సాయాన్ని పొందాలని యోచిస్తున్నారు. అదే విధంగా ఉండవల్లి సాయాన్ని పొందాలని చూస్తున్నారు. కెవిపి ఇప్పటికిప్పుడు తెరపైకి రాకున్నా తెరవెనుక మంత్రాంగం వ్యూహకర్తగా ఉండడం అన్నది జరిగేందుకు అవ కాశం ఉంది. ఇదే నిజమని చెప్పలేం కానీ కొన్ని ఊహా సంబంధ ప్ర‌తిపాద‌న‌లు రానున్న కాలంలోల పరిణామాలుగా రూపాంత‌రం జరిగేందుకు ఆస్కారం ఉంది.


రాజశేఖరరెడ్డి హయాంలో కెవిపి, ఉండవల్లి, డిఎస్ ఇలాంటి నాయకులు అదేవిధంగా బొత్స‌, ధర్మాన వంటి నాయకులు, విశాఖ ఏజెన్సీ కేంద్రంగా బాలరాజు లాంటి నాయకులు మద్దతుగా నిలిచి ఆ రోజు పార్టీ వైభవానికి, ప్రా భవానికి వైయస్సార్ వైభవానికి, ప్రా భవానికి కీలకంగా ఉన్నారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని నమ్ముకుని ఆంధ్ర రాజకీయాల్లో కీలకం కావాలని విజ‌య‌మ్మ యోచి స్తున్నారు. రేపటి వేళ నిర్వహించే సంస్మరణ సభను ఇందుకు వేదికగా మారుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: