కలియుగంలో కనిపించే ప్రత్యక్ష దైవం డాక్టర్ అని చెబుతూ ఉంటారు. ఇక కరోనా వైరస్ కాలంలో ఇది నిజమే అని నిరూపితం కూడా అయ్యింది. కరోనా వైరస్ కాలంలో ఎంతో మంది డాక్టర్లు తమ ప్రాణాలు అడ్డుగా పెట్టి మరి ప్రజల ప్రాణాలను రక్షించారు.  ఎంతోమంది ఇక కరోనా పై యుద్ధంలో ప్రాణాలు సైతం కోల్పోయారు.  ఇలా  కరోనా వైరస్ సమయంలో ప్రత్యక్ష దైవాలుగా మారిపోయారు డాక్టర్లు.  ఇలాంటి సమయంలో కొంతమంది డాక్టర్లు మాత్రం ఏకంగా ప్రజల ప్రాణాలు విషయంలో ఇంకా నిర్లక్ష్యం వీడడం లేదు. డాక్టర్ అనే వృత్తికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యానికి ఒక చిన్నారి జీవితమే  ప్రమాదం లో పడిపోయింది.



 ముక్కుపచ్చలారని ఎనిమిది నెలల పసికందు ప్రాణం అంధకారంలోకి వెళ్ళిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఇక అభం శుభం తెలియని ఆ చిన్నారికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని అకోలా జిల్లా మూర్తిజాపూర్ మండలంకి  చెందిన దంపతులకు ఎనిమిది నెలల పాప ఉంది. అయితే ఇటీవలే చిన్నారికి జ్వరం వచ్చింది.



 ఈ క్రమంలోనే తల్లిదండ్రులు మూర్తిజాపూర్ లోని ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు. ఇక అక్కడి డాక్టర్లు ఆ చిన్నారికి ఎన్నో రకాల టెస్టులు చేసారు. తెల్ల రక్త కణాలు తక్కువగా ఉండటం కారణంగానే ఆరోగ్య సమస్య వచ్చిందని వెంటనే చిన్నారికి రక్తం ఎక్కించాలి అంటూ చెప్పారు. దీంతో తల్లిదండ్రులు పరుగున వెళ్లి అకోలాలోని బిపి ఠాక్రే అనే బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని తీసుకువచ్చారు. ఇక డాక్టర్లు ఎలాంటి పరీక్షలు చేయకుండానే ఆ రక్తాన్ని చిన్నారికి ఎక్కించారు. ఇక అంతలోనే చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేల్చారు. తల్లిదండ్రులకు కూడా పరీక్ష చేయగా.. వారిద్దరికీ నెగిటివ్ వచ్చింది. దీంతో ఇక వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే 9 నెలల పసిపాప కు హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చింది అనే విషయాన్ని గ్రహించారు. ఇక ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: