ఆంధ్రప్రదేశ్ లో రైలు మార్గాల మీద కేంద్రం దృష్టి పెట్టింది. దక్షినాది రాష్ట్రాలకు అలాగే ఉత్తరాది రాష్ట్రాలకు రవాణా సౌకర్యాలను మరింత మెరుగు పరిచే క్రమంలో కేంద్రం దూకుడుగా వెళ్తుంది. ఈ నేపధ్యంలో రైల్వే ప్రాజెక్ట్ ల విషయంలో ఎక్కువగా ఫోకస్ చేసారు. ఇక ఇప్పుడు వివిధ రైల్వే ప్రాజెక్టులకు భూమి సేకరించి అప్పగించేందుకు మూడు నెలలు గడువు కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాధ్ దాస్. రాష్ట్రంలో విజయనగరం టిట్లాఘర్ 3 వ రైల్వే లైను ప్రాజెక్టుతో పాటుగా నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం భూ సమికరణలపై సీఎస్ వద్ద సమావేశం జరిగింది.

అదే విధంగా కడప-బెంగుళూర్ నూతన రైలు మార్గాలకు సంబంధించి మిగతా భూమి సమీకరించి అప్పగించేందుకు డిసెంబర్ గడువు  కోరారు ఆదిత్య నాథ్ దాస్. ప్రగతి ప్రాజెక్టులు రైల్వే, బొగ్గు,ఇంధనం,స్టీల్ ప్రాజెక్టులకు చెందిన 13 పెండింగు అంశాలపై ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో  ఢిల్లీ నుండి కేంద్రమంత్రి మనీష్ మండవియా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను సియేస్ ప్రస్తావించారు. ఇప్పటికే ఆయా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అవసరమైన భూమిలో...

కొంతమేర రైల్వే శాఖకు అప్పగించగా మిగతా భూమిపై వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ వివరించారు.  దీనిలో భాగంగా ప్రభుత్వ భూమిని గుర్తించడం తోపాటు ప్రైవేట్ భూమిని సేకరించి ఇచ్చేందుకు ఆయా భూమి యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నాం అని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ కేంద్ర మంత్రికి వివరించారు. అదే విధంగా  కొవ్వూరు- భద్రాచలం నూతన రైల్వే లైను నిర్మాణ ప్రాజెక్టు రాష్ట్ర విభజన సమయం లో కేటాయించారు అని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది  అని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap